Super Star Krishna | కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని రాజ‌కీయ ప్రస్థానం ఇదీ..

Super Star Krishna | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని.. రాజ‌కీయ రంగంలోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ‌కీయాల్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. సినీ రంగంలో దిగ్గ‌జ న‌టుడు నంద‌మూరి తార‌క రామారావును ఢీకొట్టిన కృష్ణ‌.. రాజ‌కీయంగానూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేశారు. 1972లో జ‌రిగిన జై ఆంధ్ర ఉద్య‌మానికి కృష్ణ బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. 1984లో ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చి.. నాదెండ్ల భాస్క‌ర్ రావు […]

Super Star Krishna | కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని రాజ‌కీయ ప్రస్థానం ఇదీ..

Super Star Krishna | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని.. రాజ‌కీయ రంగంలోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ‌కీయాల్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. సినీ రంగంలో దిగ్గ‌జ న‌టుడు నంద‌మూరి తార‌క రామారావును ఢీకొట్టిన కృష్ణ‌.. రాజ‌కీయంగానూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేశారు.

1972లో జ‌రిగిన జై ఆంధ్ర ఉద్య‌మానికి కృష్ణ బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. 1984లో ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చి.. నాదెండ్ల భాస్క‌ర్ రావు సీఎం అయిన సంద‌ర్భంలో.. నాదెండ్ల‌ను అభినందిస్తూ కృష్ణ పేరిట ఓ ఫుల్‌పేజీ ప్రకటన విడుదలవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

1984లో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరారు. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 1991 మళ్లీ అదేస్థానం నుంచి పోటీ చేసి ఓట‌మి చ‌వి చూశారు. అయితే ఆ తర్వాత ఆయన వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు తెలిపింది.

కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి-నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు కృష్ణ.

Super Star Krishna | సూప‌ర్ స్టార్ కృష్ణ టాప్ 50 సాంగ్స్ ఇవే..