Supreme Court | సెతల్వాద్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Supreme Court గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత పరిశీలనలు మూర్ఖంగా, అసంగతంగా ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించారన్న ఆరోపణల కేసులో మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. సెతల్వాద్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడి ధర్మాసనం కొట్టివేసింది. […]

Supreme Court | సెతల్వాద్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Supreme Court

  • గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత
  • పరిశీలనలు మూర్ఖంగా, అసంగతంగా ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించారన్న ఆరోపణల కేసులో మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. సెతల్వాద్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడి ధర్మాసనం కొట్టివేసింది.

బెయిల్‌ నిరాకరించేందుకు హైకోర్టు చూపిన కారణాలు అసంగతంగా ఉన్నాయని, హేతుబద్ధత లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసులో బెయిల్‌ అనుమతించవచ్చా లేదా? అన్న అంశం కంటే బెయిల్‌ ఎందుకు అవసరం లేదో చెప్పేందుకే పేజీలకు పేజీలు వెచ్చించారని పేర్కొన్నది.

బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి చేసిన పరిశీలనను పరిగణనలోకి తీసుకుంటే ప్రొసిడింగ్స్‌ను రద్దు చేయాలని నిందితుడు దరఖాస్తు చేసుకుంటే తప్ప.. ఏ బెయిల్‌ దరఖాస్తులోనూ అనుమతి లభించదని అభిప్రాయపడింది. ఇది మూర్ఖపు తీర్పు అని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైనందున కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. తీస్తా సెతల్వాద్‌కు షరతులతో కూడి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన ధర్మాసనం.. గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది.