ఎలక్టోరల్ బాండ్లు రాజ్యంగ విరుద్ధం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది తేల్చింది. ఎలక్ట్రోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యంగ విరుద్ధం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విధాత : ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది తేల్చింది. ఎలక్ట్రోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కోకు దారితీస్తుందని పేర్కొంది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని తెలిపింది. ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.


విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. నల్లధనం అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది.ఎలక్టోరల్‌ బాండ్ల పద్దతి ఆర్టికల్ 19(1)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతమని సుప్రీం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం విరాళాలు ఎవరిచ్చారనేది వెల్లడించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తెలిపింది.


నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ చేయడాన్ని ఎస్బీఐ నిలిపివేయాలని తెలిపింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఈసీకి సమర్పించాలని తీర్పులో వెల్లడించింది. మధ్యంతర తీర్పు ఇచ్చాక జారీ చేసిన ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.


రాజ్యంగ విరుద్ధంగా కంపనీల చట్ట సవణరలు


వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.


2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13 లోగా ఆ వివరాలను వెబ్‌ సైట్‌లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.


రాజకీయ పార్టీల విదేశాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018 జనవరి 2న ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివిగా పరిగణస్తారు. బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యం అవుతాయి.. వ్యక్తులు కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు.


రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం- 2017, సవరణ చేసింది. దాంతో ఎలక్టోరల్‌ బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ పధకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటీషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది.