Surekha and Supritha | ఇప్పటికే సోషల్ మీడియాలో చచ్చిపోతుంటే.. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చేనేమో!

Surekha and Supritha | నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ తల్లీకూతుళ్ళిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో సందడి చేయడానికి వెళుతున్నారట. ఆ తల్లీకూతుళ్లు ఎవరో కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత. నాక్కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ప్రశ్నించిన సురేఖవాణిని ఇంత వరకూ తీసుకువచ్చింది వాళ్ళే.. ఎక్కడో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అంటే.. వదిన, అక్క పాత్రల్లో కనిపించే ఈ ఆంటీని సోషల్ మీడియా […]

  • Publish Date - August 19, 2023 / 12:05 PM IST

Surekha and Supritha |

నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ తల్లీకూతుళ్ళిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో సందడి చేయడానికి వెళుతున్నారట. ఆ తల్లీకూతుళ్లు ఎవరో కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత. నాక్కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ప్రశ్నించిన సురేఖవాణిని ఇంత వరకూ తీసుకువచ్చింది వాళ్ళే.. ఎక్కడో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అంటే.. వదిన, అక్క పాత్రల్లో కనిపించే ఈ ఆంటీని సోషల్ మీడియా క్వీన్ స్థానంలో కూర్చేబెట్టింది ఆ ఫాలోయర్సే..

ఇప్పుడు తల్లిబాటలో కూతురు కూడా తగ్గేదేలే అనేలా హాట్ హాట్ హీట్ పుట్టిస్తూ.. దూసుకెళుతోంది. ఇద్దరూ కలిపి ఇన్‌స్ట్రాగ్రమ్‌లో తెగ దుమారం రేపుతున్నారు. పొట్టి పొట్టి బట్టల్లో వీళ్ళు చేసే రచ్చకు కుర్రకారు కుదైలేపోయి వీళ్ళ రీల్స్ కోసం పడిగాపులు గాస్తూ ఉంటారు. అయితే ఆ మధ్య వచ్చిన రూమర్స్‌తో.. అంతా ఇక సురేఖావాణి పనైపోయిందనుకున్నారు. ఇటీవలి కాలంలో సురేఖావాణి డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నదనే వార్తలు చాలా జోరుగా వినిపించాయి.

ఈ కేసులో పట్టుబడిన కేపీ చౌదరితో సురేఖ క్లోజ్‌గా ఉండటం.. అతనితో పార్టీలు, పబ్‌లంటూ తిరుగుతూ ఉండటంపై ఈ విషయం నిజమనే అనుకున్నారంతా. కానీ తనకేం సంబంధం లేదని, తనమీద వచ్చినవన్నీ ఉట్టి పుకార్లేనని సురేఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తనకు సినిమా ఛాన్స్‌లు తగ్గడంపై కూడా సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. తనని చిత్రసీమ దూరం పెడుతుందని, గతంలోలా వరసగా ఆఫర్స్ రావడం లేదని తన బాధను బయట పెట్టుకుంది.

అయితే పొట్టి నిక్కర్లతో ఫోజులివ్వడం వల్లనో, లేక దురసుతనం వల్లనో కానీ సురేఖకు నిజంగానే అవకాశాలు తగ్గాయి. అయితే రీసెంట్‌గా సురేఖావాణి, కూతురు సుప్రిత కూడా తల్లికి తగ్గట్టుగానే ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు చేస్తుంది. అప్పుడప్పుడు షోలతో సందడి చేస్తుంది. త్వరలో సుప్రీతని తెలుగు తెరకు పరిచయం చేయాలని సురేఖవాణి ఆలోచనట.

అందుకే ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వదులుకోకూడదని, దీని సహాయంతోనే సుప్రీతని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఫ్లాన్‌లో ఉందట సురేఖవాణి. అయితే ఇంకా బిగ్ బాస్ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అప్పుడు కానీ హౌస్‌లో ఈ అమ్మాకూతుళ్ల రచ్చ గురించి మాట్లాడుకోలేం.

Latest News