Suresh Kondeti | ‘బేబి’ హీరోయిన్‌ని ముద్దు పెట్టుకుంటానన్న సురేష్ కొండేటి.. చెప్పు తెగుద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్
Suresh Kondeti | విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం బేబి. జూలై 14న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి, విరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సాయి రాజేష్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్ర రిలీజ్ మరి కొద్ది రోజులే ఉండడంతో మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర బృందాన్ని సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ […]

Suresh Kondeti |
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం బేబి. జూలై 14న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి, విరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సాయి రాజేష్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్ర రిలీజ్ మరి కొద్ది రోజులే ఉండడంతో మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర బృందాన్ని సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు.
సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ కొండేటి ఓ సందర్భంలో.. ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అడిగారు. దానికి హీరోయిన్ ఏం సమాధానం ఇవ్వాలో అర్ధం కాలేదు. అప్పుడు సురేష్ కొండేటి.. బేబి సినిమాలో హీరో.. ముద్దు పెట్టుకుంటా అని అన్నాడు కదా, దానికి మీ రియాక్షన్ ఏంటి’ అని అడిగి కాస్త కాంట్రవర్షియల్ అయ్యేలా చేశాడు.
దీనికి వైష్ణవి చాలా కూల్‌గా స్పందిస్తూ.. టీజర్‌లో ఉన్న సీనా అంటూ . ‘చెప్పు తెగుద్ది అని అంటాను’ అని చెప్పారు. ‘ఓహో చెప్పు తెగుద్దా’ అని సురేష్ కొండేటి ఫన్నీగా అంటాడు. అయితే ఇది సినిమా ప్రమోషన్‌లో భాగంగా అడిగిన ప్రశ్న అయిన మనోడు గతంలో చేసిన రచ్చకి నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. సురేష్ కొండేటిని ట్యాగ్ చేసి మరీ తెగ ట్రోల్ చేస్తున్నారు.
‘నన్ను మా అమ్మా నాన్నా తిడితేనే చాలా బాధేసేది. అలాంటిది మీకన్నా వయసులో చిన్న వాళ్ళు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. మొహం మీద ఉమ్మేస్తున్నా కూడా ఎలా ఇలా తుడిచేసుకుని బతికేస్తున్నారు?’ అని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో సురేష్ కొండేటిని ట్యాగ్ చేసి మరీ ఈ ప్రశ్న అడిగాడు. మిగతా కొందరు అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
మీ కూతురు వయసుంటుంది ఆ అమ్మాయికి. తన పక్కన తన తండ్రి కూర్చుని ఉంటే మీరు ఇదే ప్రశ్న వేయగలరా? ఏళ్ళొచ్చాయి కానీ బుద్ధి పెరగలేదు. చదువు అబ్బింది కానీ సంస్కారం వంటబట్టలేదు మీకు. ఇంత మందితో ఛీ అనిపించుకుంటున్న మీ సిగ్గులేనితనానికి