Baby | హిట్టయిన సినిమాకి కూడా ఇదేం పనయ్యా.. ఇక మారరా?
Baby | విజయంతో పాటు దాని వెంటే వివాదాలు కూడా ఇప్పటి రోజుల్లో మామూలే. అయితే కష్టపడి తెచ్చుకున్న పేరును ఒక్కసారే బూడిదలో పోసిన పన్నీరు తరహాలో చేసేసుకున్నారంటూ.. రీసెంట్‌గా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలే చిన్న సినిమాలు ఇప్పుడున్న గట్టిపోటీని తట్టుకుని మనలేకపోతున్న పరిస్థితుల్లో మంచి కథతో, నేపథ్య సంగీతంతో తెరకెక్కిన ‘బేబీ’ మూవీ దాదాపు అన్ని చోట్లా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. సినీ దిగ్గజాల నుంచి, సామాన్యుడి మనసుల వరకూ అందరినీ […]

Baby |
విజయంతో పాటు దాని వెంటే వివాదాలు కూడా ఇప్పటి రోజుల్లో మామూలే. అయితే కష్టపడి తెచ్చుకున్న పేరును ఒక్కసారే బూడిదలో పోసిన పన్నీరు తరహాలో చేసేసుకున్నారంటూ.. రీసెంట్‌గా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలే చిన్న సినిమాలు ఇప్పుడున్న గట్టిపోటీని తట్టుకుని మనలేకపోతున్న పరిస్థితుల్లో మంచి కథతో, నేపథ్య సంగీతంతో తెరకెక్కిన ‘బేబీ’ మూవీ దాదాపు అన్ని చోట్లా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. సినీ దిగ్గజాల నుంచి, సామాన్యుడి మనసుల వరకూ అందరినీ తాకి వచ్చింది.
ప్రేమించే హృదయాలను తట్టిలేపింది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అయ్యారు. ఆ జోరంతా కలెక్షన్స్ మీద కూడా కనిపించి బాక్సాఫీస్ షేకయింది. పెద్ద సినిమాలకు దీటుగా నిలబడింది కూడా.. ఇక్కడివరకూ బాగానే ఉంది కానీ, ఈ చిత్రం కలెక్షన్స్ ఇటీవలే విడుదలైన ‘బ్రో’ సినిమాకన్నా ఎక్కువగా ఉన్నాయని వినిపించడం దగ్గరే అసలు గందరగోళం మొదలైంది. అసలు విషయం ఏంటంటే..
చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ జూలై 14న విడుదలైంది. మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది. ఇక అలాగే పవన్ సినిమా ‘బ్రో’ కూడా దూసుకుపోతుంది. ‘బేబీ’ మూవీ కొన్ని చోట్ల ‘బ్రో’ మూవీకన్నా ఎక్కువ వసూళ్ళను రాబడుతుందనే విషయాన్ని కొన్ని వెబ్ సైట్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. అయితే ఈ లెక్కల్లో ఏదో గోల్ మాల్ ఉందని, ఇదంతా ఫేక్ అని తేలింది. ఇప్పుడు ఇదే విషయం వైరల్ అవుతుంది.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 70 ఎంఎం లో ఆడుతున్న ‘బేబీ’, దేవిలో ఆడుతున్న ‘బ్రో’ నూన్ షో లెక్కల ప్రకారం బేబీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినట్టుగా ప్రచారం చేశారు.. చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద సినిమాగా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలోనే విడుదలైన 20 రోజులకి అంత వసూళ్ళు రాలేదు.
బేబీకి ఇలా ఎలా కలెక్షన్స్ వచ్చాయని కూపీ లాగితే తేలిందేమంటే బేబీకి ప్రతి రోజు నూన్ షోకి 35 వేల రూపాయలు వసూలు అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. అయితే నూన్ షో కలెక్షన్స్ అంత కనిపిస్తున్నా రోజు మొత్తం షోలకు మళ్ళీ అలాంటి కలెక్షన్స్ కనిపించడంలేదు.
దీనిమీద ఆరా తీయగా డీసీఆర్ ద్వారా ఇలా డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ పెడుతున్నారని తేలింది. కొందరు ఇలా రికార్డ్స్ కోసం రాయిస్తున్నారట. ఇదంతా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారని కలెక్షన్స్ రాకపోయినా కూడా ఇలా వస్తున్నట్టుగా చూపిస్తున్నారని తేలింది.
ఇది కావాలని చేయలేదని ప్రమోషన్ కోసం చేసింది మాత్రమేనని బేబీ నిర్మాతల వివరణ. అయితే సమస్య ఇప్పటికి సర్దుమణిగినా ఇప్పటికి ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే ఇలా ఫేక్ కలెక్షన్స్ చూపించారా లేక దేశ వ్యాప్తంగా ఇలాంటి కథ నడిపారా అనేది తేలాలని చర్చించుకుంటున్నారు. ఏదైనా కష్టపడి సంపాదించు కున్న విజయాన్ని ఇలా అడ్డదారి తొక్కి వచ్చిన పేరు, పడ్డ కష్టం అంతా పాడుచేసుకోవడం అవసరమా అంటూ బేబీ నిర్మాతలను ఆడుకుంటున్నారు నెటిజన్లు