Prabhas | ప్రభాస్‌కి సర్జరీ.. ఇప్పుడప్పుడే కాదులే!.. ఫ్యాన్స్ కంగారు పడొద్దు

Prabhas | ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల సక్సెస్‌తో అయిదు సంవత్సరాలు ఒకే సినిమాకి పని చేసిన ప్రభాస్.. ‘గ్లోబల్ స్టార్’గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, మన్ననలు పొందారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలకి కూడా అదే విధంగా ఎక్కువ టైం తీసుకునేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా విడుదల చేస్తుండాలి అని ప్రభాస్‌ని డిమాండ్ చేశారు. హిట్లూ ఫ్లాపులతో రెబెల్ స్టార్ ఉండగా తన ఫ్యాన్స్ ఆవేదన‌ని అర్థం చేసుకుని.. ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్’ […]

  • By: krs    latest    Aug 20, 2023 7:15 AM IST
Prabhas | ప్రభాస్‌కి సర్జరీ.. ఇప్పుడప్పుడే కాదులే!.. ఫ్యాన్స్ కంగారు పడొద్దు

Prabhas |

‘బాహుబలి’ సిరీస్ చిత్రాల సక్సెస్‌తో అయిదు సంవత్సరాలు ఒకే సినిమాకి పని చేసిన ప్రభాస్.. ‘గ్లోబల్ స్టార్’గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, మన్ననలు పొందారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలకి కూడా అదే విధంగా ఎక్కువ టైం తీసుకునేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా విడుదల చేస్తుండాలి అని ప్రభాస్‌ని డిమాండ్ చేశారు. హిట్లూ ఫ్లాపులతో రెబెల్ స్టార్ ఉండగా తన ఫ్యాన్స్ ఆవేదన‌ని అర్థం చేసుకుని.. ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా ఫంక్షన్‌లో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తాను ఇప్పటినుండి అని ప్రామిస్ చేశారు.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ కూడా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో సిద్ధమవుతోంది. అదే విధంగా ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే ‘సలార్’ పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో వైపు మారుతితో ఓ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇంకా సందీప్ వంగాతో ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు ప్రకటనకు రెడీ అవుతున్నాయి.

ఇలా ఎడతెరపు లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రభాస్‌పై ఇటీవల సర్జరీ అంటూ ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. అతని మోకాలికి సంబంధించి ఏదో సర్జరీ అంటూ వచ్చిన వార్తలతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్‌ మోకాలికి సర్జరీ చేశారు. ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో కృతిసనన్ సహాయంతో ప్రభాస్ నడిచిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

వాటిని చూసే వారిధ్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లుగా అంతా అనుకున్నారు. వాస్తవానికి అప్పటి నుంచి ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. మధ్యలో ఓ పది రోజుల పాటు అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చినా.. మళ్లీ నొప్పి తిరగబెట్టిందని.. సర్జరీ కంపల్సరీ అనేలా ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడప్పుడే ప్రభాస్ ఈ సర్జరీ కోసం వెళ్లడం లేదనేది తాజా సమాచారం.

‘సలార్’ సినిమా పనులు పూర్తి కాగానే తను సర్జరీ చేయించుకొని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడట. ఈ లోపు ‘కల్కి’ సినిమాకు తను లేని సన్నివేశాలను నాగ్ అశ్విన్ చిత్రీకరించుకుంటాడట. విశ్రాంతి అనంతరం మళ్లీ ‘కల్కి’ షూట్‌లో ప్రభాస్ బిజీ అవుతారట. ప్రస్తుతం ‘సలార్’తో పాటు మారుతి‌లో చేస్తున్న సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభాస్ కంప్లీట్ చేయనున్నాడని అంటున్నారు.

నాగ్ అశ్విన్ ‘కల్కి’ (ప్రాజెక్ట్-కె) ఏకంగా 600 కోట్ల బడ్జెట్‌తో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందుతుం డగా.. ఈ మూవీ‌ని వచ్చే ఏడాది జనవరి 12కి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. అలాగే.. ఎన్నో అంచనాలతో రాబోతున్న ‘సలార్’ భారీ బడ్జెత్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 28 విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత మారుతి సినిమా విడుదల ఉంటుందని, త్వరలోనే మారుతి సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనేలా టాక్ నడుస్తోంది.