BBC IT surveys | బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే.. బ్రిటిష్ ప్రభుత్వం స్పందన ఇదీ..!
BBC IT surveys | బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబయి కార్యాలయంలో మంగళవారం ఐటీ సర్వేలు నిర్వహించడంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయం బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇంతకు ముందు నోటీసులు అందజేశారని, అయితే వాటిని పాటించలేదని, లాభాలను పెద్ద ఎత్తున బీబీసీ మళ్లించిందన్న ఆరోపణల మేరకు దర్యాప్తు చేసేందుకు సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో […]

BBC IT surveys | బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబయి కార్యాలయంలో మంగళవారం ఐటీ సర్వేలు నిర్వహించడంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయం బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇంతకు ముందు నోటీసులు అందజేశారని, అయితే వాటిని పాటించలేదని, లాభాలను పెద్ద ఎత్తున బీబీసీ మళ్లించిందన్న ఆరోపణల మేరకు దర్యాప్తు చేసేందుకు సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో నిర్వహించి సర్వే నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యూకే ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ డాక్యుమెటరీపై నిషేధం విధించిన కొత్త రోజుల తర్వాత ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఢిల్లీ, ముంబయిలోని బీసీసీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడం గమనార్హం. సర్వే నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారని, వీలైనంత త్వరగా పరిస్థితిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. బీబీసీ కార్యాలయం ఆదాయపు పన్నుశాఖ సర్వేపై అమెరికా స్పందించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు ప్రాముఖ్యం ఇస్తామని పేర్కొన్నారు.