Suryapeta | నిత్యం ప్రజల కోసం పరితపించే నేత మంత్రి జగదీశ్‌రెడ్డి: ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీత

Suryapeta మరోసారి ఆదరించి ఆశీర్వదించండి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీశ్‌ రెడ్డి కోలాటం మహిళలకు చీరలు పంపిణీ విధాత: నిత్యం ప్రజల కోసం పరితపించే మంత్రి జగదీశ్‌ రెడ్డి ని ఆదరించి సూర్యాపేటను మరింత అభివృద్ది చేసుకోవాలని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30 వ వార్డులో జగదీశన్న కప్-2023 లో భాగం గా కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. […]

Suryapeta | నిత్యం ప్రజల కోసం పరితపించే నేత మంత్రి జగదీశ్‌రెడ్డి: ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీత

Suryapeta

  • మరోసారి ఆదరించి ఆశీర్వదించండి
  • ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీశ్‌ రెడ్డి
  • కోలాటం మహిళలకు చీరలు పంపిణీ

విధాత: నిత్యం ప్రజల కోసం పరితపించే మంత్రి జగదీశ్‌ రెడ్డి ని ఆదరించి సూర్యాపేటను మరింత అభివృద్ది చేసుకోవాలని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30 వ వార్డులో జగదీశన్న కప్-2023 లో భాగం గా కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.

2014లో తాము ప్రజల వద్దకు వస్తే ఎన్నో సమస్యలు చెప్పారని నేడు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. 2014లో సూర్యాపేట పట్టణం ఇప్పుడు ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంగా చేసి రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి జగదీశ్‌ రెడ్డిదేనన్నారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కలను బాగా పెంచి సూర్యాపేట జిల్లాలో అటవీ శాతాన్ని పెంచడం అభినందనీయమన్నారు.

సూర్యాపేట జిల్లాలో ఇంతటి అభివృద్ధి మంత్రి జగదీశ్‌ రెడ్డి నాయకత్వంలోనే జరిగిందన్నారు. రోజులో 20 గంటలు పని చేస్తూ ప్రతి నిత్యం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే జగదీశ్‌ రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామన్నారు.

ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట ప్రజల అదృష్టం అన్నారు. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చి పాలనను ప్రజలకు దగ్గర చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, 21 స్మశానవాటికలు మహాప్రస్థానంతో ఎంతో అభివృద్ది చేశారన్నారు.

30 వార్డ్ మినీ టాంక్ బండ్ తో ఎంతో ఆహ్లాద కరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 30 వార్డు బీఆరెస్ అధ్యక్షులు గాలి సాయి కిరణ్ , వార్డ్ ఇంచార్జ్ గాలి రమాదేవి, ఎపూరి శ్రవణ్ కుమార్ , హజారి రంగయ్య, మద్ది ఉపేందర్ రెడ్డి , ఈదుల శంకరయ్య, రామసాని శ్రీనివాస నాయుడు, సిద్ది అశోక్, దాచేపల్లి సుజాత, బచ్చునీరజ, చింతా రామ ప్రసన్న, గిల్లకత్తుల నాగమణి, అంబికా, సునీత తదితరులు పాల్గొన్నారు.