Taapsee pannu | బికినీలో మంట పెట్టిన సొట్ట‌బుగ్గ‌ల సుందరి.. తెగ చూపించేస్తుందిగా..!

Taapsee pannu | సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఝుమ్మందినాదం అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ తొలి చిత్రంలోనే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకోగా, ఆ త‌ర్వాత ప‌లు సినిమా అవ‌కాశాలు ద‌క్కాయి. అయితే తెలుగులో తాప్సీ చేసిన సినిమాలు ఆమెకి మంచి విజయాన్నిఅందించ‌కపోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ క‌థాప‌ర‌మైన సినిమాలకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవ‌ల […]

  • By: sn    latest    Aug 26, 2023 10:32 AM IST
Taapsee pannu | బికినీలో మంట పెట్టిన సొట్ట‌బుగ్గ‌ల సుందరి.. తెగ చూపించేస్తుందిగా..!

Taapsee pannu |

సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఝుమ్మందినాదం అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ తొలి చిత్రంలోనే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకోగా, ఆ త‌ర్వాత ప‌లు సినిమా అవ‌కాశాలు ద‌క్కాయి. అయితే తెలుగులో తాప్సీ చేసిన సినిమాలు ఆమెకి మంచి విజయాన్నిఅందించ‌కపోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది.

అక్క‌డ క‌థాప‌ర‌మైన సినిమాలకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవ‌ల ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ త‌న స‌త్తా ఏంటో చూపించింది. తాప్సీ సినిమాల‌తోనే కాక వివాదాల‌తోను ఎక్కువ‌గా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఎవ‌రి గురించి అయిన నిర్మొహ‌మాటంగా మాట్లాడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది.

ఇక సోష‌ల్ మీడియాలోను తాప్సీ కాక రేపుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డి ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. బౌండరీలు బ్రేక్ చేసిన అమ్మడు బికినీలో రెచ్చిపోయి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది.

బోల్డ్‌ అవతారంలో క‌నిపించి సోషల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బికినీని పోలిన డిజైనర్ వేర్ ధరించి అమ్మడు అందాల ఆరబోత పీక్స్ లో ఉంద‌నే చెప్పాలి. తాప్సీ స్ట‌న్నింగ్ లుక్స్‌ని ప్ర‌తి ఒక్క‌రు తెగ ఆస్వాదిస్తున్నారు. ఇక తాప్సీ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో అధికంగా చిత్రాలు చేస్తున్న అమ్మడు, తెలుగు తమిళ భాషల్లో మాత్రం అప్పుడ‌ప్పుడు అలా ప‌ల‌క‌రించిపోతుంది.

కొద్ది రోజుల క్రితం మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు అనే చిత్రం చేస్తుంది. ఇందులో ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సీ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంది.

బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. త‌మిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సీ నటిస్తుండ‌గా, ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి.ఓ లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో కూడా తాప్సీ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం తాప్సీ త‌న ప్రియుడితో ప్రేమాణంలో మునిగి తేలుతుండ‌గా, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నుంది.