Madhya Pradesh | టీచ‌ర్ల‌ తీన్మార్ డ్యాన్స్ మాములుగా లేదుగా!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో స్టేజీపైనే విద్యార్థులు, టీచ‌ర్ల నృత్యాలు ట్రైనింగ్ వ‌ర్క్‌షాప్‌లో బందేలి జాన‌ప‌ద పాట‌కు డ్యాన్స్‌ షోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన డ్యాన్స్ వీడియో విధాత‌: ఇటీవ‌ల ప్ర‌తి కార్య‌క్ర‌మంలో చివ‌రికి డ్యాన్స్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ప్ర‌భుత్వ, ప్రైవేటు, వ్య‌క్తిగ‌త, ఇత‌ర‌ కార్య‌మేదైనా చివ‌ర‌లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉండాల్సిందే. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (Madhya Pradesh)లో హైయ‌ర్ సెకండీ, హైస్కూల్ ప్రిన్సిపాళ్ల‌కు శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు. శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ముగిసిన త‌ర్వాత సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌లో […]

Madhya Pradesh | టీచ‌ర్ల‌ తీన్మార్ డ్యాన్స్ మాములుగా లేదుగా!
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో స్టేజీపైనే విద్యార్థులు, టీచ‌ర్ల నృత్యాలు
  • ట్రైనింగ్ వ‌ర్క్‌షాప్‌లో బందేలి జాన‌ప‌ద పాట‌కు డ్యాన్స్‌
  • షోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన డ్యాన్స్ వీడియో

విధాత‌: ఇటీవ‌ల ప్ర‌తి కార్య‌క్ర‌మంలో చివ‌రికి డ్యాన్స్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ప్ర‌భుత్వ, ప్రైవేటు, వ్య‌క్తిగ‌త, ఇత‌ర‌ కార్య‌మేదైనా చివ‌ర‌లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉండాల్సిందే. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (Madhya Pradesh)లో హైయ‌ర్ సెకండీ, హైస్కూల్ ప్రిన్సిపాళ్ల‌కు శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు.

శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ముగిసిన త‌ర్వాత సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌లో దాగి ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ను ప్రిన్సిపాళ్లు బ‌య‌ట‌పెట్టారు. తీన్మార్ స్టెప్పులేశారు. విద్యార్థుల‌తో క‌లిసి మ‌హిళా టీచ‌ర్లు సైతం డ్యాన్స్‌లో దుమ్ము లేపారు. ఈ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టికామ్‌గఢ్‌ నగరంలోని ఒక పాఠశాలలో హయ్యర్ సెకండరీ, హైస్కూల్‌ ప్రిన్సిపాల్స్‌కు మంగ‌ళ‌వారం శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. నిరంతర అభ్యాసం, విస్తృతమైన మూల్యాంకనం అంశంపై శిక్ష‌ణ పూర్త‌యింది. సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

శిక్షణా వేదికపైనే ఉపాధ్యాయులు, విద్యార్థులు బుందేలి జానపద గీతానికి నృత్యం ఇర‌గ‌దీశారు. ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.