Team India | బ్లాక్‌ జెర్సీలో మెరిసిన టీమిండియా ఆటగాళ్లు..!

Team India | వెస్టిండీస్‌లో టీమ్‌ ఇండియా పర్యటించనున్నది. టెస్టులు, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో పాల్గొననున్నది. జులై 12 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్నది. డొమినికా విండ్సర్ పార్క్ మైదానంలో జూలై 12 నుంచి 16 వరకు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు బార్బడోస్‌లో ఐదు రోజుల క్యాంప్‌ జరిగింది. ఇందులో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలిటెస్టు భారత జట్టు డొమినికా బయలుదేరింది. కెప్టెన్ […]

Team India | బ్లాక్‌ జెర్సీలో మెరిసిన టీమిండియా ఆటగాళ్లు..!

Team India |

వెస్టిండీస్‌లో టీమ్‌ ఇండియా పర్యటించనున్నది. టెస్టులు, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో పాల్గొననున్నది. జులై 12 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్నది. డొమినికా విండ్సర్ పార్క్ మైదానంలో జూలై 12 నుంచి 16 వరకు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు బార్బడోస్‌లో ఐదు రోజుల క్యాంప్‌ జరిగింది. ఇందులో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలిటెస్టు భారత జట్టు డొమినికా బయలుదేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, శుభ్‌మన్, జైస్వాల్, ఇషాన్ కిషన్ కలిసి ప్రయాణించారు.

అయితే, ఒడిమినా వెళ్తున్న సమయంలో ఆటగాళ్లు ధరించిన జెర్సీలు అందరినీ ఆకర్షించాయి. బ్లాక్‌ టీ షర్ట్‌ ధరించగా.. అందరినీ ఆకట్టుకున్నది. కొత్త జెర్సీని చూసి అభిమానులు సోషల్‌ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. బ్లాక్ పాంథర్స్ ధాటికి వెస్టిండీస్ వణికిపోవడం వణకడం ఖాయమని పలువురు యూజర్లు పేర్కొన్నారు.

ఇటీవల టీమ్‌ ఇండియా జెర్సీ స్పాన్సర్‌ షిప్‌ కంపెనీ మారిసన విషయం తెలిసిందే. ఇంతకు ముందు నైకీ కొనసాగగా.. ప్రస్తుతం అడిడాస్‌ టీమిండియాకు జెర్సీలను సరఫరా చేయనున్నది. నైకీ బ్లూ కలర్‌ జెర్సీలను టీమిండియాకు సరఫరా చేస్తుండగా.. అడిడాస్ కంపెనీ మాత్రం బ్లాక్ కలర్ జెర్సీని అందిస్తున్నది.

వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్యా రహానె, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జయదేవ్‌ ఉనద్కట్‌, నవదీప్ సైనీ.