కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి.. అనితారెడ్డిలు

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డిలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు

  • By: Somu    latest    Feb 26, 2024 10:54 AM IST
కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి.. అనితారెడ్డిలు

విధాత : బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డిలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగా తాము కాంగ్రెస్ లో చేరామన్నారు.