TS Budget-2023-24 | రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు

TS Budget-2023-24 | రూ.2,90,396 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేన్నర కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ […]

TS Budget-2023-24 | రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు

TS Budget-2023-24 | రూ.2,90,396 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేన్నర కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది.

ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ మోడల్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుంది.

కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనా తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా నిలబడగలిగింది. సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో ప్రజా సంక్షేమ పథకాలను భారీగా ఎత్తున నిరాటంకంగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది.

రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల, ప్రజలకు ఆకాంక్షల అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకుసాగుతున్నాం. 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. నాకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్‌డీపీ 12శాతమే. జాతీయ వృద్ధి రేటైన 13.4శాతం కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆర్థిక క్రమశిక్షణ, కార్యాచరణతో జీఎస్‌డీపీ పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెట్టుబడి వ్యవయానికి, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నది.

ఈ అభివృద్ధి మోడల్‌ గురించి ఊరూవాడ.. ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి యావత్‌ దేశంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్‌డీపీ వృద్ధి రేటు 13.2 శాతానికి చేరింది.

ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 10.2 శాతానికి తగ్గింది. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతికాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతుంది.

2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసారి ఆదాయ వృద్ధి రేటు 11.8శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ నీతి అయోగ్‌ నివేదికలో పేర్కొంది.

తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర వృద్ధి రేటు దేశ వృద్ధి రేటుకన్నా ఎక్కువ నమోదు అవుతున్నది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్రవాటా 4.1శాతం ఉండగా.. 2020-21 నాటికి 4.9శాతానికి పెరిగింది. దేశ జనాభాలో 2.9శాతమే తెలంగాణ ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 కావడం అందరికీ గర్వకారణం.

దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటును సాధిస్తుంది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6శాతం జీఎస్‌డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రధాన, ఉపరంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తుంది. వ్యవసాయం, అనుబంధరంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య, పశు సంపద భారీగా పెరిగింది. ద్వితీయ, తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్‌, రవాణా, హోటళ్లు తదితర సేవారంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేదు. రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2013-14లో 1.12లక్షలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 3.15లక్షలు ఉండవచ్చని అంచనా. ఇది జాతీయ సగటైన 1.70లక్షల కంటే 86శాతం ఎక్కువ.

జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1.46లక్షల అధికం. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం. ఒక వైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుంది. సాగునీటి సత్వరం పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సేకరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రూ.53,970 కోట్లుగా బడ్జెట్‌లో పొందు పరిచి ఈ సభలో ఆమోదించుకున్నా. కానీ, కేంద్రం ఏకపక్షంగా 15,033 కోట్లు కోతపెట్టి 38,937 కోట్లకు తగ్గించింది. కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నది.

పన్నుల వాటాల్లో 2019-20లో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా రూ.723కోట్ల స్పెషల్‌ గ్రాంట్‌ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినా కేంద్రం ఇవ్వకుండా మొండిచేయి చూపింది. 2021-26 సంవత్సరాలకు గాను 15వ ఆర్థిక సంఘం రూ.5374 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని చెబితే ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసింది.

చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా ఆర్థిక సంఘం సిఫారసులను బేఖాతరు చేయలేదు. విభజన చట్టంలోని 94 సెక్షన్‌ 1 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో పన్నుల్లో రాయితీలు ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

కానీ, కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది. విభజనచట్టంలోని 94 సెక్షన్‌ 2 ప్రకారం.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించి. ఇందుకు ఏటా 450కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. మూడేళ్లకు 1350కోట్లు ఇవ్వలేదు’ అన్నారు.