Telangana Cabinet | అడవి బిడ్డలకు తీపి కబురు.. 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు..
Telangana Cabinet | ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూములకు( Podu Lands ) పట్టాల కోసం ఎదురుచూస్తున్న అడవి బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు పోడు భూములకు సంబంధించిన 1,55,393 మంది అడవి బిడ్డలకు( Tribals ) పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు […]

Telangana Cabinet | ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూములకు( Podu Lands ) పట్టాల కోసం ఎదురుచూస్తున్న అడవి బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) తీపి కబురు అందించింది.
రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు పోడు భూములకు సంబంధించిన 1,55,393 మంది అడవి బిడ్డలకు( Tribals ) పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారులకు పట్టాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉంచామని మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) మీడియాకు వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్( BR Ambedkar ) విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది దళితులను( Dalits ) ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, ఒక గొప్ప పండుగ మాదిరిగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.