Telangana Congress PAC Meeting| తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం..ఖర్గే..వేణుగోపాల్ ల హాజరు
విధాత, హైదరాబాద్ : గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వయిజరీ కమిటీల సంయుక్త సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి,రాష్ట కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. కుల గణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలపై కూడా పీఏసీలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చాక నిర్వహించడంపై చర్చ సాగింది.
క్రమశిక్షణ అంశంపై పీఏసీ ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సమావేశం అనంతరం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరై ప్రసంగిస్తారు. ఈ సభకు గ్రామ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలు 40 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశ చరిత్రలో ఆల్ ఇండియా పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షులు.. గ్రామ స్థాయి అధ్యక్షులతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడటం ఇదే ప్రథమంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram