Telangana farmers | తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు.. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ..
Telangana farmers ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ విధాత: రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురు. మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవాకరం 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు […]
Telangana farmers
- ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ
విధాత: రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురు. మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవాకరం 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం 9 లక్షల2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి.
2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట ఇచ్చిన విషయం తెల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram