Telangana History | యుగయుగాన నవ చరిత.. తెలంగాణ చరిత్ర

Telangana History విధాత‌: తెలంగాణ చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రాంతం. గోండ్వాణా భూఖండంలో భాగం. గోదావరి నదీ తీరంలో ఒకప్పుడు ఇక్కడ రాకాసి బల్లులు తిరగేవి. భారత దేశంలో సుమారుగా క్రీ.పూ. 6 - 5 శతాబ్దాల కాలం ఎంతో ప్రాముఖ్యం గలది. సింధూలోయ నాగరిత అంతరించిన తరువాత రెండవ నగర నాగరికత విలసిల్లిన కాలమది. నగర ఇనుము యుగపు కాలమిది. వైదిక విశ్వాసాలను ఆక్షేపించిన శ్రమణుల కాలం కూడా కొంత ఇదే. బౌద్ధ జైన మతాల […]

Telangana History | యుగయుగాన నవ చరిత.. తెలంగాణ చరిత్ర

Telangana History

విధాత‌: తెలంగాణ చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రాంతం. గోండ్వాణా భూఖండంలో భాగం. గోదావరి నదీ తీరంలో ఒకప్పుడు ఇక్కడ రాకాసి బల్లులు తిరగేవి. భారత దేశంలో సుమారుగా క్రీ.పూ. 6 – 5 శతాబ్దాల కాలం ఎంతో ప్రాముఖ్యం గలది. సింధూలోయ నాగరిత అంతరించిన తరువాత రెండవ నగర నాగరికత విలసిల్లిన కాలమది. నగర ఇనుము యుగపు కాలమిది. వైదిక విశ్వాసాలను ఆక్షేపించిన శ్రమణుల కాలం కూడా కొంత ఇదే. బౌద్ధ జైన మతాల పుట్టుకకు దారి తీసిన పరిస్థితులు ఇవి.

భారత దేశంలో ప్రజలు ఎన్నుకునే గణ ప్రభుత్వాలు ఏర్పడిన ఈ కాలంలో షోడష జనపదాల (పదహారు జనపదాలు) వివరాలు మనకు లభించాయి. ఈ పదహారు గణ రాజ్యాలలో పశ్చిమాన గాంధార మొదలుకొని తూర్పున అంగ జనపదం వరకు పదిహను జనపదాలు వింధ్యకు ఉత్తరాన ఉన్నవే. కానీ దక్షిణాదిన మాత్ర అశ్మక (అస్సక) జనపదం మాత్రమే ఉన్నది. అది నేటి బోధన్ దీని రాజధాని. పోదన, పోతలి, పౌదన్యపురం, పోతన మొదలైన పేర్లు దీనికి ఉండేవి.

ఈ జనపదం కొంత భాగం మహారాష్ట్రలోకి విస్తరించి ఉన్నది. క్రీ. పూ. 700 నుంచి క్రీ. పూ. 345 వరకు ఈ జనపదం ఉండేది. బౌద్ధ గ్రంథాలలోనూ, పురాణాలలోనూ దీని ప్రస్తావన ఉన్నది. బ్రాహ్మణాల కాలం నాటికే అశ్మక ఉన్నది. మహా గోవింద సుత్తన లో ఇక్కడి రాజు బ్రహ్మ దత్త ప్రస్తావన ఉన్నది.

కృష్ణా నది ఒడ్డున తొలినాళ్ళలో కాలాన్ని కొలిచే రాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో బయట పడ్డాయి. వీటిని నిలువు రాళ్ళు అంటారు. నాటి కాల గణనకు, అంతరిక్ష పరిశీలనకు ఇది ఇది నిదర్శనం. మహబూబ్ నగర్ లోని పీర్లగుట్ట దగ్గర చరిత్ర పూర్వ యుగపు చిత్రకళ బయటపడ్డది. చరిత్ర పూర్వ యుగం నుంచే తెలంగాణకు విదేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నదుల ద్వారా రవాణా వ్యవస్థ నెలకొన్నది. 2/8

మిగతా ప్రపంచంతోని పోలిస్తే ఇనుప యుగం తెలంగాణలోనే ముందు ప్రవేశించింది. క్రీ. పూ. 2, 200 నాటికే ఇక్కడ లోహ శుద్ధి (మెటలర్జీ) శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం వృద్ధి చెందింది. ఇక్కడి ఉక్కును నాడు ఊట్జ్ అనేవారు. ఇక్కడి నుంచి అరబ్బు ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది.

అరబ్బు ప్రాంతంలో డామాస్కస్ స్టీల్గా ప్రసిద్ధి చెందినది తెలంగాణ నుంచి ఎగుమతి అయిన ముడి ఉక్కు. అత్యంత దృఢమైన ఖడ్గాలను ఈ ఉక్కుతో తయారు చేసేవారు. పలు చరిత్ర ప్రసిద్ది పొందిన ఖడ్గాలు తెలంగాణ ఉక్కుతో చేసినవే. ఇదే విధంగా ఖమ్మం జిల్లాలోని కిన్నెర సాని ఒడిలోనే శిల్ప కళ తొలి ఆనవాళ్ళు కనిపించాయని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం అంటూ చరిత్రపాఠాలలో చెబుతారు. కానీ మౌర్యుల అనంతరమే వచ్చిన శాతవాహన సామ్రాజ్యాన్ని చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించరు. ఇది ఉత్తరాది ఆధిపత్యంలో సాగుతున్న పక్షపాతం. దేశంలోని తొట్ట తొలి అతి పెద్ద సామ్రాజ్యం ఇదే. శాతన వాహన సామ్రాజ్యం కోట లింగాలలో మొదలైనట్టు తెలుస్తున్నది.

శాతవాహన పూర్వ కాలపు నాణాలు కూడా కోట లింగాలలో లభించాయి. శాత వాహన మూల పురుషుడు సిముఖ నాణాలు కూడా కోటలింగాలలో దొరికాయి. మొదటి శాతకర్ణి నాణాలు కూడా ఇక్కడ లభించాయి. ఈ కాలంలో గోదావరి, కృష్ణా నదులపై అనేక రేవుల ద్వారా వాణిజ్యం సాగేది. సముద్రవాణిజ్యం కూడా విలసిల్లింది. క్రమంగా ఈ సామ్రాజ్యానికి మహారాష్ట్రలోని పైఠాన్ (నాడు ప్రతిష్ఠానపురం) రాజధానిగా మారింది.

దక్షిణాదినే కాకుండా గుజరాత్, మధ్య ప్రదేశ్ వరకు ఈ సామ్రాజ్యం విస్తరించింది. ఈ పాలనలో పారిశ్రామికాభివృద్ధి చోటు చేసుకున్నది. సాహిత్యం, వాస్తు కళ అభివృద్ధి చెందింది. బౌద్ధ విహారాలు, స్థూపాల నిర్మాణం సాగింది. బౌద్ధంతో పాటు వైదికానికి ఆదరణ లభించింది.

శాతవాహనులలోని 17వ రాజు హాలుడు గొప్ప కవి. ఈయన సంకలనం చేసిన గాథా సప్తశత్తి నాటి జీవన విధానాలను, మానవుల ఉద్వేగాలను, ప్రకృతిని చక్కగా చిత్రించింది. నాటి ప్రజల ఆర్థిక, సామాజిక జీవనానికి అద్దం పట్టింది. సామాన్య మానవులే తొలి సాహితీవేత్తలు అనడానికి నిదర్శనం ఈ సంకలనం. హాలుడి

ఆస్థానంలోని గుణాఢ్యుడు బృహత్కథ రచించాడు. దీని ఆధారంగానే ఆ తరువాత కాలంలో సోమదేవుడి కథాసరిత్సాగరం రచన సాగింది. కథాసరిత్సాగరం పర్షియన్ భాషలో బహర్ అల్ అస్మర్, దార్యా యి అస్మర్గా రూపుదిద్దుకున్నది. ప్రపంచానికి తొలి సంకలాన్ని అందించిన ఘనత ఇక్కడ ప్రజలకు చెందుతుంది. ఈ సంకలనం లౌకికమైనది, ప్రజా సాహిత్యం. అరేబియన్ నైట్స్, కాంటర్ బరీ టేల్స్క ఈ రచనలు పరోక్ష ప్రేరణగా నిలిచాయి. శాలి వాహన శకారంభం ఈ కాలంలోనే జరిగింది.

తెలంగాణలో శాతవాహనుల తరువాత అవతరించిన పెద్ద సామ్రాజ్యం కాకతీయ. 12వ శతాబ్దంలో వీరి పాలన మొదలైంది. భారత దేశ చరిత్రలో 13 శతాబ్దిలోనే మహిళా చక్రవర్తి (సామ్రాజ్ఞి) అయిన రుద్రమదేవిని (1262- 1289) అందించిన ఘనత తెలంగాణదే. రుద్రమ దేవి పాలనా కాలం. ఢిల్లీని రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు స్వల్ప కాలం పాలించారు. రుద్రమ దేవి స్థిరంగా పాలించారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వరకు ఈ సామ్రాజ్యం విస్తరించింది. ఆనాటి చెరువుల తవ్వకాన్ని ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటాం. రామప్ప ఆలయం నాటి శిల్పకళకు ప్రతీక.

పదహారవ శతాబ్దిలో గోల్కొండ కేంద్రంగా సాగిన కుతుబ్ షాహీల పాలన కూడా తెలంగాణ వైభవానికి అద్దం పడుతుంది. ఇది అత్యంత

సంపన్నమైన రాజ్యం. చేతి వృత్తులు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇక్కడి నుంచి వస్త్రాలు, వజ్రాలు ఎగుమతి అయ్యాయి. ఇక్కడి వస్త్రాలు ఎంతో నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. పర్షియాకు, యూరపు ఆగ్నేయాసియాకు ఎగుమతి అయ్యేవి. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ప్రపంచ వజ్రాల వాణిజ్య కేంద్రంగా గోల్కొండ ఉండేది. చార్మినార్ నిర్మాణం ఈ కాలంలోనే జరిగింది. తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగింది. అధికార భాషగా తెలుగును ఉపయోగించడం మొదలైంది.

ఆసఫ్ జాహి పాలకులలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911- నుంచి 1948 వరకు పాలించారు. ఈ కాలంలో హైదరాబాద్ రాజ్యం ఆర్ధికంగా, సాంస్కృతికంగా ఎంతో మార్పులు చెందింద. పరిపాలన రంగంలోనూ మార్పులు వచ్చాయి. ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్ నిర్మాణం ఈ కాలంలోనే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భిన్న రంగాల ప్రముఖులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

ఉస్మానియా విశ్వ విద్యాలయం, ఉస్మానియా దవాఖాన మొదలైనవన్నీ ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ పెద్ద వైద్య కేంద్రంగా మారింది. హైదరాబాద్ నగరంలోని నిజామియా అబ్జర్వేటరీ (వేధశాల) ప్రముఖమైనది. ఒకప్పుడు మత్తు లేకుండా శస్త్ర చికిత్సలు చేయడం రోగులకు చిత్ర హింసగా ఉండేది. క్లోరోఫామ్ కనిపెట్టడంతో ఈ కష్టం తీరింది.

క్లోరోఫామ్ పై పరిశోధనలు సాగించి, వాడటం మొదలు పెట్టింది హైదరాబాద్లోనే. ఇక్కడ నుంచి లక్షలాది నక్షత్రాల గుర్తింపు జరిగింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనా కార్యక్రమంలో భాగమైంది. దక్షిణార్ధగోళంలో ఉండే అతి కొద్ది వేధశాలలో ఇదొకటి. ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలోనే విద్యుత్ ఉండేది.

హైదరాబాద్ రాజ్యానికి సొంత కరెన్సీ, బ్యాంక్ ఉండేది. సొంత విమానాశ్రయాలు ఉండేవి. సొంత రైల్వే వ్యవస్థ ఉండేది. ఆనాడే హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండేది. ఇక్కడి గ్రంథాలయం దేశంలోని అతి పెద్ద గ్రంథాలయాలలో ఒకటి. కలకత్తా తరువాత ప్రాచీన ప్రతులు, గ్రంథాలు ఎక్కువగా లభ్యమయ్యేది ఇక్కడే.

పద్దెనమిదవ శతాబ్ది చివరి పాదం నుంచి ఇక్కడ పరిశ్రమల స్థాపన భారీగా జరిగింది. జిందా తిలిస్మాత్, సింగరేణి కాలరీస్, దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ, విఎ, అజాం జాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్, ప్రాగా టూల్స్, హైదరాబాద్ అస్బెస్టాస్, సర్ సిల్క్, సిర్పూర్ కాగజ్ మిల్స్ మొదలైనవి నాటి తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనాలు. ఇక్కడ పోలో క్రీడా మైదానాలు కూడా ఎక్కువగా ఉండేవి.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్ రాజ్యానికి, యూనియన్ ప్రభుత్వానికి మధ్య యథాతథ ఒప్పందం జరిగింది. 1948 సెప్టెంబరు 17న ఆపరేషన్ పోలో పేర జరిపిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనమైంది. ఆ తరువాత మిలిటరీ అధికారి జనరల్ చౌదరి ద్వారా కేంద్ర పాలన సాగింది. 1949

6/8

డిసెంబర్ వరకు సైనిక పాలన సాగింది. ఆ తరువాత 1952 మార్చి వరకు వెల్లోడి అనే అధికారి ద్వారా కేంద్ర పాలన సాగింది. 1930 జనవరి 26 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు నిజాం హైదరాబాద్ స్టేట్ కు రాజ ప్రముఖ్ గా ఉన్నారు. 1952లో తొలి ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణా రావు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక అధికారులను విశ్వసించలేదు. దీంతో మద్రాసు నుంచి వచ్చిన ఆంధ్రా అధికారులకు వ్యతిరేకంగా 1952లోనే ముల్కీ ఉద్యమం తలెత్తింది.

1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనంతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. 1989 లో భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ఇందులో విద్యార్థులది ప్రధాన పాత్ర. ఉద్యోగులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి భారీ సీట్లు గెలుచుకోవడం ప్రజల మద్దతుకు నిదర్శరం. ఆ తరువాత పలు రూపాలలో ఆందోళన జరిగింది.

కానీ 1980 దశకం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ బలపడింది. 1990 దశకం చివరలో ఈ ఉద్యమం తీవ్ర రూపం సంతరించుకోవడం మొదలైంది. పలు సంస్థలు ఏర్పడ్డాయి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగింది. (2022 అక్టోబర్లో టీఆర్ఎస్ పేరు మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా మారింది.)2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రం అవతరించింది.