IPL 2023 | తెలుగు పాటలతో దద్దరిల్లిపోయిన మోదీ స్టేడియం
IPL 2023 | ఐపీఎల్ 2023 చాలా ఘనంగా ప్రారంభమైంది. గుజరాత్( Gujarat )లోని నరేంద్ర మోదీ స్టేడియం( Narendra Modi Stadium ) వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2023( IPL 2023 )లో సినీ తారలు మెరిసిపోయారు. అంతే కాదు తెలుగు పాటలతో( Telugu Songs ) స్టేడియం దద్దరిల్లి పోయింది. ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన తమన్నా భాటియా( Tamanna Bhatia ), రష్మిక మందన్నా( Rashmika Mandanna ) తెలుగు పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. […]

IPL 2023 | ఐపీఎల్ 2023 చాలా ఘనంగా ప్రారంభమైంది. గుజరాత్( Gujarat )లోని నరేంద్ర మోదీ స్టేడియం( Narendra Modi Stadium ) వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2023( IPL 2023 )లో సినీ తారలు మెరిసిపోయారు. అంతే కాదు తెలుగు పాటలతో( Telugu Songs ) స్టేడియం దద్దరిల్లి పోయింది. ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన తమన్నా భాటియా( Tamanna Bhatia ), రష్మిక మందన్నా( Rashmika Mandanna ) తెలుగు పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. క్రికెట్ అభిమానుల్లో( Cricket Fans ) ఫుల్ జోష్ నింపారు.
పుష్ప( Pushpa ) సినిమాలోని ఊ అంటవా ఊఊ అంటవా పాటకు తమన్నా స్టెప్పులేస్తే.. స్టేడియం అంతా విజిల్స్ వేసింది. రష్మిక సామీ సామీ గ్రేస్ మూమెంట్స్ క్రికెటర్లలో జోష్ నింపాయి. ఇటీవలే ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట( Naatu Naatu ) కూడా ఓపెనింగ్ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.
IPL 2023 ఓపెనింగ్ సెర్మనీలో, ప్రముఖ గాయకుడు అర్జీత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో అదరగొట్టాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకను అర్జీత్ సింగ్ ‘కేసరియా’ అనే సూపర్‌హిట్ పాటతో ప్రారంభించారు. అర్జీత్ సింగ్ కేసరియా పాటకు డ్యాన్స్ చేయమని అభిమానులను కోరాడు.