ఉమ్మడి ఆదిలాబాద్‌పై మంచు దుప్పటి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
విధాత: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మంచు దప్పటి పరుచుకుంది. ఉదయం 9 గంటలు దాటినా కూడ పొగ మంచు కురుస్తూనే ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గత రెండు మూడు రోజులుగా 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రజలు ఉదయం సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మంటలు వేసుకొని చలి కాచుకుంటున్నారు. మంచు కురుస్తుండడంతో వాహన దారులు రహదారులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం వరకు […]
విధాత: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మంచు దప్పటి పరుచుకుంది. ఉదయం 9 గంటలు దాటినా కూడ పొగ మంచు కురుస్తూనే ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గత రెండు మూడు రోజులుగా 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
ప్రజలు ఉదయం సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మంటలు వేసుకొని చలి కాచుకుంటున్నారు. మంచు కురుస్తుండడంతో వాహన దారులు రహదారులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అతి తక్కువగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) 9.3 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram