Lover Attack | ప్రియుడిని చావబాది.. నగ్నంగా రోడ్డుపై వదిలేసిన యువతి
Lover Attack | ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని మనసారా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ యువతి మాత్రం తన ప్రియుడిని ఒంటరిగా పిలిపించుకుని, చావ బాది, నడిరోడ్డుపై నగ్నంగా వదిలేసి పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే ఏరియాలో గత నెల 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. థానేకు చెందిన బాలాజీ శివభగత్ భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆ యువకుడికి పావిక […]

Lover Attack | ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని మనసారా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ యువతి మాత్రం తన ప్రియుడిని ఒంటరిగా పిలిపించుకుని, చావ బాది, నడిరోడ్డుపై నగ్నంగా వదిలేసి పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే ఏరియాలో గత నెల 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. థానేకు చెందిన బాలాజీ శివభగత్ భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆ యువకుడికి పావిక బోయర్ అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తన ప్రేయసికి అడిగిందల్లా ఇచ్చాడు బాలాజీ. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అయితే గత నెల 28న బాలాజీకి బోయర్ ఫోన్ చేసి.. షాహాపూర్ హైవే వద్దకు రావాలని కోరింది. దీంతో ప్రియుడు ఆమెకు బహుమతులు తీసుకొని సాయంత్రం 4:30 గంటలకు అక్కడ వాలిపోయాడు. అప్పటికే ప్రియురాలు అక్కడ వెయిట్ చేస్తోంది. ఇద్దరు కలిసి కారులో కూర్చొని సరదగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
సీన్ కట్ చేస్తే.. కొన్ని గంటల తర్వాత ఓ నలుగురు వ్యక్తులు వచ్చి బాలాజీపై దాడి చేశారు. చావబాదారు. అతని వద్ద ఉన్న నగదు, ఇతర వస్తువులను తీసుకున్నారు. అనంతరం అతని బట్టలు విడిపించి నగ్నంగా చేశారు. బట్టలను కూడా దూరంగా పడేశారు. ఇక బోయర్, ఆమె నలుగురు స్నేహితులు కలిసి కారులో పరారీ అయ్యారు. ఇక రాత్రంతా తీవ్ర గాయాలతో బాధపడుతూ హైవేపైనే బాలాజీ ఉండిపోయాడు.
మరుసటి రోజు పొద్దున్నే బాలాజీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలాజీని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురిలో ఇద్దరిని పావిక బోయర్, నదీం ఖాన్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు. మిగతా వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు.