అసెంబ్లీలో అడుగు పెట్టబోయే మహిళా ఎమ్మెల్యేలు వీరే.. ముగ్గురు కొత్త వాళ్లే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 8 మంది మహిళా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 8 మంది మహిళా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ 8 మందిలో ముగ్గురు కొత్తవారే. ఈ ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సంఖ్య ఆరు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.
అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టబోయేది వీరే..
మొత్తం 8 మంది మహిళలు ఎమ్మెల్యేగా గెలవగా, ఇందులో ముగ్గురు కొత్తవారు. ఈ ముగ్గురిలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థి. నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పర్ణికా రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై గెలుపొందారు. పాలకుర్తి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి.. ఎర్రబెల్లి దయాకర్ రావుపై విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత.. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.
ఇక ఈ ముగ్గురు కాకుండా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు పాతవారే. వారు గతంలో కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున, సీతక్క ములుగు నుంచి కాంగ్రెస్ తరపున, సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ తరపున, కోవ లక్ష్మి ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచారు.Sitakka, Yashaswini Reddy, Parnika Reddy, Lasya Nandita
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram