Vemulawada: వేములవాడ టికెట్ ఆయనకే.. నో డౌట్: బోయినపల్లి
గెలుపు గుర్రాలను వదిలిపెట్టుకుంటామా? వేములవాడ టికెట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విధాత బ్యూరో, కరీంనగర్: వచ్చే ఎన్నికలలో 99 శాతం సీట్లు సిట్టింగులకే అని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.. కావున వేములవాడలో అభ్యర్థిని మారుస్తారనే ఊహాజనిత వార్తలకు అర్థం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ 'పార్టీలోని […]

- గెలుపు గుర్రాలను వదిలిపెట్టుకుంటామా?
- వేములవాడ టికెట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: వచ్చే ఎన్నికలలో 99 శాతం సీట్లు సిట్టింగులకే అని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.. కావున వేములవాడలో అభ్యర్థిని మారుస్తారనే ఊహాజనిత వార్తలకు అర్థం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఆదివారం ఆయన వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ ‘పార్టీలోని ఎవరైనా టికెట్ ఆశించడంలో తప్పులేదు.. అయితే గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించడం అనేది అన్ని రాజకీయ పార్టీలకు వర్తించే సూత్రం అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ గ్రాఫ్ బాగుందని సర్వేలు స్పష్టం చేస్తుండగా, అభ్యర్థులను ఎందుకు మార్చుతామంటూ ఆయన ప్రశ్నించారు.
వేములవాడ నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు చెన్నమనేని రమేష్ బాబు నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు… ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు ఇది నిదర్శనం..
అలాంటప్పుడు ప్రజాధరణ కలిగిన నాయకున్ని ఎలా వదులుకుంటామన్నారు.
వేములవాడ విషయంలో నూటికి నూరు శాతం తమ అభ్యర్థి రమేష్ బాబు అని, అందులో ఎలాంటి సందేహానికి తావు లేదని చెప్పారు. ఈ నియోజకవర్గ విషయంలో కొత్త ఆలోచన కూడా పార్టీ అధిష్టానం మదిలో లేదన్నారు.