భారత తొలి బడ్జెట్ విశేషాలివే.. ప్రవేశపెట్టింది అధికార పార్టీ వ్యక్తి కాదు..
Union Budget | ఫిబ్రవరి 1వ తేదీన మోదీ ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను రేపు మధ్యాహ్నం లోక్‌సభలో చదివి వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి భారత తొలి బడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడేమో అధికార పార్టీకి చెందిన ఎంపీనే సభలో బడ్జెట్‌లో ప్రవేశపెడుతున్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాకుండా, బ్రిటీష్ అనుకూల పార్టీగా ఉన్న వ్యక్తి ప్రవేశపెట్టారు. బడ్జెట్ లీకులు […]

Union Budget | ఫిబ్రవరి 1వ తేదీన మోదీ ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను రేపు మధ్యాహ్నం లోక్‌సభలో చదివి వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి భారత తొలి బడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడేమో అధికార పార్టీకి చెందిన ఎంపీనే సభలో బడ్జెట్‌లో ప్రవేశపెడుతున్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాకుండా, బ్రిటీష్ అనుకూల పార్టీగా ఉన్న వ్యక్తి ప్రవేశపెట్టారు. బడ్జెట్ లీకులు ముందే చేయడంతో రాజీనామా వంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
1947-48 ఆర్థిక సంవత్సరానికి గానూ తొలి బడ్జెట్‌ను ఆర్ షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. షణ్ముగం శెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు.. బ్రిటీష్ అనుకూల పార్టీగా ఉన్న జస్టిస్ పార్టీ నేత. శెట్టి చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌కు అడ్వైజర్‌గా కూడా పని చేశారు.
1947, నవంబర్ 26వ తేదీన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ వ్యయాన్ని మొత్తం రూ. 197.39 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా, అత్యధికంగా రూ. 92.74 కోట్లు రక్షణ రంగానికే కేటాయించారు.
ఇప్పుడేమో బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు. కానీ అప్పట్లో మాత్రం బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఎందుకంటే బ్రిటన్‌లోని రాజకీయ నాయకులు, సభ్యులు కూడా సౌకర్యవంతంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. వారికి అప్పుడు మధ్యాహ్నం సమయం అయ్యేది.
భారత బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే వరకు అత్యంత గోప్యంగా ఉంచేవారు. అయితే యూకే చాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ హూ డాల్టన్.. బడ్జెట్‌లోని కీలకమైన పన్ను మార్పులను ఓ జర్నలిస్టుకు లీకు చేశాడు. దీంతో సదరు జర్నలిస్టు కీలక పన్ను మార్పులను వార్తగా ప్రచురించాడు. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత డాల్టన్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇక బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే వారు కొద్ది రోజుల పాటు తమ నివాసాలకు కూడా వెళ్లరు. ఇప్పటికీ ఆ పద్ధతి కొనసాగుతోంది.