86 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం.. నవ్వుల పాలైన నిర్మలా సీతారామన్
Nirmala Sitaraman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. 1 గంట 26 నిమిషాల(86 నిమిషాలు) పాటు కొనసాగింది. అత్యంత తక్కువ సమయంలో చదివి వినిపించిన బడ్జెట్ ఇదే. 2020 సంవత్సరంలో అత్యధికంగా 162 నిమిషాల పాటు సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మూడో సారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలకడంతో విపక్ష సభ్యులు గట్టిగా […]
Nirmala Sitaraman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. 1 గంట 26 నిమిషాల(86 నిమిషాలు) పాటు కొనసాగింది. అత్యంత తక్కువ సమయంలో చదివి వినిపించిన బడ్జెట్ ఇదే. 2020 సంవత్సరంలో అత్యధికంగా 162 నిమిషాల పాటు సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
మూడో సారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలకడంతో విపక్ష సభ్యులు గట్టిగా నవ్వేశారు. వాహనాల తుక్కు పాలసీ గురించి సీతారామన్ ప్రకటన చేస్తూ.. పాత వాహనాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సందర్భంలో.. ఓల్డ్ పొలిటికల్ అని వ్యాఖ్యానించారు. తప్పుగా వ్యాఖ్యానించానని గ్రహించిన ఆర్థిక మంత్రి.. క్షమాపణలు చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వాహనాలు అని సరిదిద్దుకున్నారు. పొల్యూటింగ్ పదం స్థానంలో పొలిటికల్ అని నిర్మల పలకడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ సందర్భంలో తన పొరపాటును గుర్తించిన నిర్మల ఓ చిరునవ్వు నవ్వేశారు.
MPs laugh as FM Nirmala Sitharaman slips up, says ‘political’ instead of ‘polluting’. #Budget2023 #BudgetWithEJ
Read: https://t.co/Bp1CoWd5xA pic.twitter.com/m2YwwFpg4O
— editorji (@editorji) February 1, 2023
ఐదు బడ్జెట్ల సమర్పణల్లో నిర్మల కోట్స్ కొన్ని..
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఉద్దేశించి.. అమృత కాలంలో తొలి బడ్జెట్ అంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గతంలోనూ బడ్జెట్లను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ పలు కోట్స్‌ను ఉదహరించారు.
2022 బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యక్ష పన్నుల గురించి తెలుపుతూ ఆమె మహాభారతంలో ఓ పద్యాన్ని ప్రస్తావించారు. ధర్మాన్ని అనుసరించి రాజు పన్నులను వసూలు చేయాలని మహాభారతంలోని శాంతి పర్వాన్ని ఉటంకించారు.
2021లో కొవిడ్-19 వ్యాప్తి అనంతరం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మహమ్మారితో గతంలో ఎన్నడూ చూడని పరిస్ధితుల నడుమ ఈ బడ్జెట్‌ను సభ ముందుకు తెచ్చామని వ్యాఖ్యానించారు.
2020లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మన ప్రజలకు ఉపాధి అవకాశాలు దక్కాలి..వ్యాపారాలు మైనారిటీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసేలా ఉండాలని ఈ బడ్జెట్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
2019లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చాణక్య నీతిని, ఉర్ధూ కవి మంజూర్ హష్మీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. బసవేశ్వర బోధనలనూ ఉటంకించారు. అంకితభావంతో మనిషి చేసే కర్మలతో లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని చాణక్యనీతిలోని వాక్యాలను నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram