ఈ విశాఖ కార్పొరేటర్లు గ్రేట్.. విలువైన కూపన్లు తిరిగి ఇచ్చేశారు..!
విధాత: సాధారణంగా బడ్జెట్ సమావేశాలు అనంతరం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఖరీదైన కానుకలు.. కూపన్లు.. గిఫ్ట్ హ్యాంపర్లు అందజేస్తారు. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీసీసీ వారి నుంచి కానుకల బుట్టలు అందరికి అందేవి. ఖరీదైన వెంకటగిరి.. ధర్మవరం.. గద్వాల్ పట్టు చీరలు ఇలా అందిస్తుండే వారు. ఆ తరువాత వాటి రూపం మారింది. ల్యాప్ టాపులు, మొబైల్ ఫోన్లు కూడా ఇచ్చిన దాఖలాలున్నాయ్. ఇదే పద్ధతి అటు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అమలు చేస్తూ […]

విధాత: సాధారణంగా బడ్జెట్ సమావేశాలు అనంతరం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఖరీదైన కానుకలు.. కూపన్లు.. గిఫ్ట్ హ్యాంపర్లు అందజేస్తారు. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీసీసీ వారి నుంచి కానుకల బుట్టలు అందరికి అందేవి. ఖరీదైన వెంకటగిరి.. ధర్మవరం.. గద్వాల్ పట్టు చీరలు ఇలా అందిస్తుండే వారు.
ఆ తరువాత వాటి రూపం మారింది. ల్యాప్ టాపులు, మొబైల్ ఫోన్లు కూడా ఇచ్చిన దాఖలాలున్నాయ్. ఇదే పద్ధతి అటు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అమలు చేస్తూ వస్తున్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన తరువాత సభలోని సభ్యులందరూ వీటిని తీసుకుని ఇళ్లకు వెళ్తారు. ఏటా ఈ గిఫ్తుల గురించి సభ్యుల్లో కాస్త ఆత్రుత కూడా ఉంటుంది.ఈ సారి ఏమిస్తారో అని.
ఇవే కాకుండా ఊటీ, కులూమానాలి, కాశ్మీర్ వంటి ప్రదేశాలకు అధ్యయన యాత్ర పేరుతోనూ షికార్లు తిప్పుతుండడం అందరికి తెలిసిందే. వీళ్ళు అక్కడ అధ్యయనం చేసింది ఏమిటో ఇక్కడికొచ్చి ప్రజలకు చేసింది ఏమిటో తెలీదు. కానీ ప్రజాధనం మాత్రం కర్పూరంలా కరిగిపోవడం ఖాయం.
గ్రేటర్ విశాఖలోనూ మొన్న బడ్జెట్ సమావేశాలు ముగిశాక కార్పొరేటర్లు అందరికి రూ.15వేల విలువైన గిఫ్ట్ కూపన్లు అందజేశారు. అయితే మొత్తం 81 వార్డులకు గాను ఇద్దరంటే ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం తమ గిఫ్ట్ కూపన్లను కార్పోరేషన్‌కు తిప్పి పంపారు.
సీపీఐ నుంచి 78వ వార్డులో గెలిచిన ఎం. గంగారావ్, ఇంకా 22వ వార్డు నుంచి గెలిచిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సైతం తమ కూపన్లను తిప్పి పంపారు. ప్రజల పనులతో మనుగడ సాగించే కార్పోరేషన్ ఇలా ప్రజాధనాన్ని కార్పొరేటర్లకు పంచడం ఏమిటని వారు ప్రశ్నించారు. అధికార,అనాధికారులకు మొత్తం 204 కూపన్లు పంపిణీ చేశారు.