కారులో వచ్చి కరెంట్ బల్బుల దొంగతనం.. ఇది పెద్ద స్కెచ్చే (వీడియో)
Rajasthan | విధాత: దొంగతనం చేసేందుకు దోపిడీ దొంగలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో దొంగలు కరెంట్ బల్బులను దొంగిలిస్తున్నారు. ఆ తర్వాత చీకటి ఏర్పడటంతో దొంగతనం చేసేందుకు సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవాల్ గర్హ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోల్సియా గ్రామంలోకి ఆదివారం అర్ధరాత్రి సమయంలో మారుతి ఆల్టో కారులో వచ్చిన దొంగలు ప్రవేశించారు. ఓ షాపు వద్ద కారును ఆపి […]

Rajasthan | విధాత: దొంగతనం చేసేందుకు దోపిడీ దొంగలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో దొంగలు కరెంట్ బల్బులను దొంగిలిస్తున్నారు. ఆ తర్వాత చీకటి ఏర్పడటంతో దొంగతనం చేసేందుకు సులువుగా ఉంటుందని భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నవాల్ గర్హ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోల్సియా గ్రామంలోకి ఆదివారం అర్ధరాత్రి సమయంలో మారుతి ఆల్టో కారులో వచ్చిన దొంగలు ప్రవేశించారు. ఓ షాపు వద్ద కారును ఆపి అక్కడున్న బల్బును దొంగిలించేందుకు యత్నించారు. కానీ సాధ్యం కాలేదు. మరో షాపు వద్దకు వచ్చి కుర్చీ సాయంతో.. మరో కరెంట్ బల్బును దొంగిలించారు.
అయితే దొంగలు షట్టర్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ దుకాణదారుడికి మెలకువ వచ్చింది. ఆ షాపు యజమానిని గమనించిన దొంగలు అక్కడ్నుంచి పారిపోయారు. అయితే షాపుల ముందు ఉన్న బల్బులను దొంగిలించి, చీకట్లో దోపిడీ చేసేందుకు దొంగలు ప్లాన్ చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Caught on CCTV: Rajasthan Thieves Arrive In Car To Steal Lightbulbs pic.twitter.com/52841PnjHc
— NDTV (@ndtv) November 8, 2022