MLA Madan Reddy | టికెట్ అపడం బాధగా ఉంది.. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

MLA Madan Reddy | నాయకులు, కార్యకర్తలు నావెంటే కేసీఆర్ పునరాలోచించాలి భారీగా కార్ల ర్యాలీ విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 9 టికెట్ లు ప్రకటించి, నర్సాపూర్ ను పెండింగ్ పెట్టడం బాధగా ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి భారీ కార్ల కాన్వాయ్ తో ఎమ్మెల్యే నర్సాపూర్ […]

  • By: krs |    latest |    Published on : Aug 28, 2023 3:26 PM IST
MLA Madan Reddy | టికెట్ అపడం బాధగా ఉంది.. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

MLA Madan Reddy |

  • నాయకులు, కార్యకర్తలు నావెంటే
  • కేసీఆర్ పునరాలోచించాలి
  • భారీగా కార్ల ర్యాలీ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 9 టికెట్ లు ప్రకటించి, నర్సాపూర్ ను పెండింగ్ పెట్టడం బాధగా ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ నుంచి భారీ కార్ల కాన్వాయ్ తో ఎమ్మెల్యే నర్సాపూర్ కు చేరుకొని విలేకరులతో మాట్లాడారు. తాను నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. సీఎం కేసీఆర్ టికెట్ తనకే కేటాయిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నర్సాపూర్ లో పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు టికెట్ అడగడం, కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వాలని కోరారు.

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ అంతా ఒక వైపు ఉందన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ లు,ఎంపీపీ లు,సర్పంచులు,మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.