మద్యం సేవించి దొంగతనానికి.. పులికి బలయ్యాడు..
ఓ ముగ్గురు యువకులు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ పీకల దాకా మద్యం సేవించారు. తమకు కొంచెం దూరంలో ఉన్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు యత్నించాడు. అటుగా వచ్చిన ఓ పెద్ద పులి ముగ్గురిలో ఒకరిపై దాడి చేసి చంపింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నసీఫ్ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు సమీపంలోని మోహన్ ప్రాంతానికి వెళ్లాడు. ముగ్గురు కలిసి […]

ఓ ముగ్గురు యువకులు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ పీకల దాకా మద్యం సేవించారు. తమకు కొంచెం దూరంలో ఉన్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు యత్నించాడు. అటుగా వచ్చిన ఓ పెద్ద పులి ముగ్గురిలో ఒకరిపై దాడి చేసి చంపింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నసీఫ్ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు సమీపంలోని మోహన్ ప్రాంతానికి వెళ్లాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అక్కడే ఇనుప రాడ్లను గమనించిన వారు.. వాటిని దొంగిలించాలని ప్లాన్ చేశారు.
ఇనుప రాడ్ల వద్దకు వెళ్లిన సమయంలో.. అటుగా వచ్చిన ఓ పులి నసీఫ్‌పై దాడి చేసింది. అప్రమత్తమైన మిగతా ఇద్దరు అక్కడ్నుంచి పారిపోయారు. అటవీ శాఖ సిబ్బందికి ఆ ఇద్దరు సమాచారం అందించారు. మరుసటి రోజు రక్తపు మడుగులో పడి ఉన్న నసీఫ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పులిని బంధించేందుకు ఆ ఏరియాలో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఇక ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.