సినిమా వాళ్లు…ఎమ్మెల్యేలు అంతా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలి : ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి
సినిమా నటులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
విధాత : తరుచూ వివాదస్పద అంశాలు.. ముక్కుసూటి వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా కొనసాగుతున్నజడ్చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ సారి డ్రగ్స్ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులు అంతా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగించేవారు ఎక్కువ అని.. సినీ ఇండస్ట్రీకి చెందినవారు 90రోజులకొకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు నటులు ఈ టెస్టులు చేయించుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాకు సంబంధించిన వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించాకే సినిమాలు విడుదల చేయాలని అన్నారు.
అలాగే ప్రజాప్రతిధులపై ప్రజల్లో విశ్వాసం నిలబడాలంటే వారు కూడా డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్ టెస్టులు చేయించుకుని అసెంబ్లీ, మండలి సమావేశాలకు హాజరైతే మంచిది అని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ప్రజల్లో వారిపై విశ్వాసం పెరుగుతుందని , యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. మొయినాబాద్ ఘటనను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా నేను డ్రగ్స్ టెస్ట్ కోసం బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారిని మళ్లీ డ్రగ్స్ ముట్టుకోవాలంటే భయపడేటట్టు కఠినంగా శిక్షించాలని కోరారు. మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి :
Consanguineous Marriage : మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు నిజమేనా?
కాంగ్రెస్ భవిష్యత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram