Phone tapping case | రాజకీయ నాయకులను,ప్రజాప్రతినిధులను విచారిస్తాం … ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్‌జోన్ డీసీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని, రాజకీయ నేతలను విచారించి, వారి వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, సాక్ష్యాల తర్వాతా ప్రజాప్రతినిధులను సైతం ప్రశ్నిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిడ్ తెలిపారు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని, రాజకీయ నేతలను విచారించి, వారి వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, సాక్ష్యాల తర్వాతా ప్రజాప్రతినిధులను సైతం ప్రశ్నిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిడ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చార్జిషిట్ దాఖలు చేశామని, కోర్టు చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు విదేశాల్లో ఉన్నారని, వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. కాగా రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతిరావు, మాజీ డీఎస్పీ ప్రణిత్‌రావులను అరెస్టు చేయడం విదితమే.