Tigress | భోపాల్ యూనివర్సిటీలో.. ఆడ పులి సంచారం

Tigress | విధాత‌: ఇటీవలి కాలంలో పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవులకు సమీపంలోని గ్రామాల్లోకి పులులు ప్రవేశించి స్థానికులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ university లోకి ఆడ పులి ప్రవేశించింది. భోపాల్ లోని జాగరణ్ లేక్ సిటీ university లోకి శనివారం తెల్లవారుజామున ఓ ఆడపులి ప్రవేశించింది. యూనివర్సిటీ పరిసర ప్రాంతాలతో పాటు వీసీ ఛాంబర్ వద్ద పులి సంచరించింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరా ల్లో రికార్డు అయ్యాయి. పులి సంచారంతో […]

  • By: krs    latest    Aug 06, 2023 2:12 AM IST
Tigress | భోపాల్ యూనివర్సిటీలో.. ఆడ పులి సంచారం

Tigress |

విధాత‌: ఇటీవలి కాలంలో పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవులకు సమీపంలోని గ్రామాల్లోకి పులులు ప్రవేశించి స్థానికులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ university లోకి ఆడ పులి ప్రవేశించింది.

భోపాల్ లోని జాగరణ్ లేక్ సిటీ university లోకి శనివారం తెల్లవారుజామున ఓ ఆడపులి ప్రవేశించింది. యూనివర్సిటీ పరిసర ప్రాంతాలతో పాటు వీసీ ఛాంబర్ వద్ద పులి సంచరించింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరా ల్లో రికార్డు అయ్యాయి.

పులి సంచారంతో యూనివర్సిటీ సిబ్బంది, స్టూడెంట్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూనివర్సిటీ కి చేరుకున్న అటవీ శాఖా అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ ఆడ పులికి నాలుగు పిల్లలు ఉన్నాయని గుర్తించారు. ఇటీవల కలియసోత్ ఏరియా లోను ఈ పులి సంచరించింది అని తెలిపారు.