TJS | తెలంగాణ జనసమితి.. రాష్ట్ర ప్రధాకార్యదర్శిగా ధర్మార్జున్
TJS విధాత: తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాకార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది తెలంగాణ ఉద్యమనాయకుడు ధర్మార్జున్ ను ఆ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొ.కోదండరాం నియమించడం జరిగింది. ఇటీవల జూన్ 18న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ధర్మార్జున్ ప్రగతి విద్యార్ధి ఉద్యమంలో, విప్లవ ప్రజా ఉద్యమంలో, క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నియోజకవర్గం కన్వీనర్ గా తెలంగాణ భావజాల వ్యాప్తి చేస్తూ నియోజకవర్గ […]

TJS
విధాత: తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాకార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది తెలంగాణ ఉద్యమనాయకుడు ధర్మార్జున్ ను ఆ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొ.కోదండరాం నియమించడం జరిగింది. ఇటీవల జూన్ 18న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది.
ధర్మార్జున్ ప్రగతి విద్యార్ధి ఉద్యమంలో, విప్లవ ప్రజా ఉద్యమంలో, క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నియోజకవర్గం కన్వీనర్ గా తెలంగాణ భావజాల వ్యాప్తి చేస్తూ నియోజకవర్గ వ్యాపితంగా ,గ్రామాలలో సదస్సులు , మీటింగ్ లు నిర్వహించారు.
ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో సూర్యాపేట కేంద్రంగా జేఏసీ చైర్మన్ గా ఈ ప్రాంతంలో* *నాయకత్వం వహించాడు, అనేక పోరాటాలు నిర్వహించి సకలజనుల ను ఈ ప్రాంత ఉద్యమ కారులను సమన్వయం చేస్తున్న క్రమంలో అనేక కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్ళాడు.
సూర్యాపేటలో వందల రోజులు నిరాహార దీక్ష శిబిరాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఎన్నో దాడులను ఎదుర్కొన్నాడు. టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉద్యమంలో సూర్యాపేటకు తగిన గుర్తింపు తేవడంలో కీలక భూమిక పోషించాడు. తెలంగాణ అనంతరం నాటి జేఏసీ నేత కోదండరాం తో పాటే కొనసాగుతూ సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు ఉద్యమిస్తున్నారు.
మారిన రాజకీయ పరిస్థతులలలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో కెసిఅర్ ప్రభుత్వం విఫలమైందని అవినీతి పాలన సాగిస్తున్నారని మారాల్సింది పాలకులు మాత్రమే కాదని పాలనా విధానం, రాజకీయాలు అని కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటులో క్రియాశీలక బాధ్యుడు గా వున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మార్జున్ రాష్ట్ర ప్రధాకార్యదర్శిగా, నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ధర్మార్జున్ ప్రకటించారు. ఇటీవల సూర్యాపేటలో రాష్ట్ర ప్లీనరీ అనంతరం రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త కమిటిలో ధర్మార్జున్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోదండరాం నియమించారు. తనను రాష్ట్ర ప్రధాకార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కోదండరాంకు ధర్మార్జున్ కృతజ్ఞత లు చెప్పారు.