TMC MLA | ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. మరో TMC ఎమ్మెల్యే అరెస్ట్‌

విధాత‌: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో మరో టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే (TMC MLA) జిబాన్‌ కృష్ణ సాహా ను అరెస్టు చేసినట్టు సీబీఐ తెలిపింది. ముర్షిదాబాద్‌ జిల్లా బుర్వాన్ ఎమ్మెల్యే సాహాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగాల్‌లో ఎయిడెడ్‌ పాఠశాలల్లో అక్రమ నియామకాలకు సంబంధించి గుర్‌వాన్‌ ఎమ్మెల్యే సాహాను ఈ నెల 14 నుంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు […]

  • By: Somu    latest    Apr 17, 2023 10:13 AM IST
TMC MLA | ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. మరో TMC ఎమ్మెల్యే అరెస్ట్‌

విధాత‌: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో మరో టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే (TMC MLA) జిబాన్‌ కృష్ణ సాహా ను అరెస్టు చేసినట్టు సీబీఐ తెలిపింది.

ముర్షిదాబాద్‌ జిల్లా బుర్వాన్ ఎమ్మెల్యే సాహాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగాల్‌లో ఎయిడెడ్‌ పాఠశాలల్లో అక్రమ నియామకాలకు సంబంధించి గుర్‌వాన్‌ ఎమ్మెల్యే సాహాను ఈ నెల 14 నుంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన మూడో ఎమ్మెల్యేగా సాహా నిలిచారు. ఇప్పటికే మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.