Upasana | దుబాయ్‌లో ఉపాసన సీమంతం.. మురిసిపోయిన రామ్‌చరణ్
Upasana | మెగా ఇంటి కోడలు, టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్( Ramcharan ) భార్య ఉపాసన త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ దంపతులు దుబాయ్( Dubai ) వెకేషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాసన పుట్టింటి వారు దుబాయ్‌లో ఆమె సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల మధ్యలో ఈ వేడుకలను నిర్వహించగా, ఉపాసన, రామ్ చరణ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. దాదాపు పెళ్లైన 11 ఏండ్ల […]
Upasana |
మెగా ఇంటి కోడలు, టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్( Ramcharan ) భార్య ఉపాసన త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ దంపతులు దుబాయ్( Dubai ) వెకేషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాసన పుట్టింటి వారు దుబాయ్‌లో ఆమె సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల మధ్యలో ఈ వేడుకలను నిర్వహించగా, ఉపాసన, రామ్ చరణ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. దాదాపు పెళ్లైన 11 ఏండ్ల తర్వాత ఈ జంట పేరెంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా కుటుంబం సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
సీమంతం వేడుకల అనంతరం స్థానికంగా ఉన్న నమ్మోస్ బీచ్‌లో చెర్రీ దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని, మురిసిపోయారు. సీమంతం వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని.
బెస్ట్ బేబీ షవర్‌ను ఏర్పాటు చేసిన నా డార్లింగ్ సిస్టర్స్‌కు థ్యాంక్యూ అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్‌చరణ్ తన పుట్టిన రోజు(మార్చి 27) వేడుకల అనంతరం తన శ్రీమతి ఉపాసనతో కలిసి దుబాయ్‌కు వెళ్లిన విషయం విదితమే. ఈ వెకేషన్ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్ పాల్గొనే అవకాశం ఉంది.
Soooooo grateful ❤️ for all the love.
Thank u my darling sisters & all our friends & family for the best baby shower. @AlwaysRamCharan pic.twitter.com/nfmxsXbGhM
— Upasana Konidela (@upasanakonidela) April 5, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram