Nivetha Thomas | పెళ్లెప్పుడని ప్రశ్నించిన నెటిజన్.. ఫొటోతో సమాధానం చెప్పిన నివేదా థామస్
Nivetha Thomas | ఇటీవల చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు. మూడుపదులో వయసులోనూ మరికొందరు కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఎక్కడ కనిపించినా అందరు అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. ఇదే ప్రశ్న తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు సైతం ఎదురువగా.. క్లారిటీ ఇచ్చింది. కోలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో నాని హీరోయిన్‌గా నటించిన జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం […]
Nivetha Thomas | ఇటీవల చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు. మూడుపదులో వయసులోనూ మరికొందరు కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఎక్కడ కనిపించినా అందరు అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. ఇదే ప్రశ్న తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు సైతం ఎదురువగా.. క్లారిటీ ఇచ్చింది.
కోలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో నాని హీరోయిన్‌గా నటించిన జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వరుస విజయాలను అందుకున్నది. ఆ తర్వాత నానితోనే ‘నిన్నుకోరి’, ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చిత్రాల్లోనూ నటించింది.

తెలుగుతో పాటు మలయాళం, తమిళ్‌లోనూ నటించింది. తక్కువ సమయంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నివేథా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
చేతికి గోరింటాకు పెట్టుకున్న ఫొటోను షేర్ చేయడంతో పెళ్లి చేసుకోబోతుందని అందరూ ఊహించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించాడు. దానికి సంబంధించిన నివేదా థామస్ స్పందించింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పింది.
పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అందరికీ చెబుతానని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల నివేదా థామస్ నటించిన ‘శాకిని ఢాకిని’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మళయాలంలో ఎంతాడ సాజి చిత్రంలో నటిస్తున్నది.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram