Naatu Naatu | నాటు నాటుకు ఆస్కార్.. తమ్మారెడ్డి భరద్వాజ రియాక్షన్ ఇదే..
Naatu Naatu | ఆర్ఆర్ఆర్( RRR ) మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి టాలీవుడ్( Tollywood ), బాలీవుడ్( Bollywood ) సినీ ప్రముఖులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అయితే మొన్నటి వరకు ఈ సినిమా పట్ల తీవ్ర అసహనం ప్రదర్శించిన ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) […]
Naatu Naatu | ఆర్ఆర్ఆర్( RRR ) మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి టాలీవుడ్( Tollywood ), బాలీవుడ్( Bollywood ) సినీ ప్రముఖులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అయితే మొన్నటి వరకు ఈ సినిమా పట్ల తీవ్ర అసహనం ప్రదర్శించిన ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) నిన్న పాజిటివ్‌గా స్పందించారు.
ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని తమ్మారెడ్డి ఆరోపించారు. ఆ డబ్బు తనకిస్తే 8 సినిమాలు చేసేవాణ్ణి అని ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారాన్ని రేపాయి. ఈ సందర్భంలో చాలా మంది తమ్మారెడ్డిపై నిప్పులు చెరిగారు.
మరి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో.. తమ్మారెడ్డి రియాక్షన్ ఏంటని అటు సినీ ప్రముఖులు, ఇటు నెటిజన్లు వేచి చూశారు. కానీ తమ్మారెడ్డి పాజిటివ్‌గా స్పందించారు. మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. నాకే కాదు.. ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతి కొద్ది మందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి నా అభినందనలు తెలుపుతున్నాను అని తమ్మారెడ్డి భరద్వాజా పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram