హోలి పండుగ వేళ విషాదం..నలుగురు యువకుల గల్లంతు
హోలి పండగ రోజున కొమురం భీం జిలాల్లో కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు ఘటన విషాదం రేపింది

విధాత : హోలి పండగ రోజున కొమురం భీం జిలాల్లో కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు ఘటన విషాదం రేపింది. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిమాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు స్నానం చేసేందుకు వార్ధా నదిలోకి దిగగా, వారిలో నలుగురు గల్లంతయ్యారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
గల్లంతైన యువకుల కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిలో సంతోష్ (25), ప్రవీణ్ (23), కమలాకర్(22), సాయి(22) గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన తమ పిల్లల ఆచూకీ కోసం ఘటన స్థలంలో కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్న దృశ్యాలు అందరిని కలిచివేశాయి.