Trains Cancellation | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌! వారం పాటు 22 ఎంఎంటీఎస్‌.. 36 రైళ్లు రద్దు..!

Trains Cancellation | రైల్వే యాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్‌తో పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 31 నుంచి వచ్చే నెల 6 వరకూ 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మెయింటనెన్స్‌ పనుల కారణంగా ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని కోరింది. ఇక రద్దు చేసిన వాటిలో […]

Trains Cancellation | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌! వారం పాటు 22 ఎంఎంటీఎస్‌.. 36 రైళ్లు రద్దు..!

Trains Cancellation | రైల్వే యాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్‌తో పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 31 నుంచి వచ్చే నెల 6 వరకూ 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

మెయింటనెన్స్‌ పనుల కారణంగా ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని కోరింది. ఇక రద్దు చేసిన వాటిలో లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య నడిచే 12 ఎంఎంటీఎస్‌ రైళ్లు ఉన్నాయి. మిగతా 10 ఎంఎంటీఎస్‌లు ఉమ్దానగర్‌ – లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచేవి రైళ్లు ఉన్నాయి.

36 రైళ్లు రద్దు..

వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేట్రాక్‌లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-కట్‌పడి స్టేషన్ల మధ్య రెండు రద్దవగా.. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రద్దు కొనసాగుతుంది ఒక ప్రకటనలో పేర్కొంది.

కాజీపేట్‌-డోర్నకల్‌, విజయవాడ-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, బల్హార్ష-విజయవాడ, కాజీపేట్‌-సిర్పూర్‌టౌన్‌, బల్హార్ష-కాజీపేట్‌, సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం రోడ్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌, నిజామాబాద్‌-కరీంనగర్‌ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి.

ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేసినట్లు తెలిపింది. గుంటూరు డివిజనల్‌ పరిధిలో చూస్తే గుంటూరు-డోన్, కాచిగూడ- నడికుడి, విజయవాడ-గుంటూరు, మాచర్ల-గుంటూరు, నడికుడి-మాచర్ల వద్ద నడిచే పది రైళ్లను చేసినట్లు అధికారులు వెల్లడించారు.

విజయవాడ-బిట్రగుంట, చెన్నై-బిట్రగుంట, రాజమండ్రి- విశాఖపట్నం, విజయవాడ-గూడూరు, విజయవాడ-ఒంగోలు మధ్య నడిచే రైలు సర్వీసులు సైతం రద్దయ్యాయి.