Trivikram Srinivas | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన తర్వాత చేసే సినిమాల విషయంలో.. సినిమా అనగానే టక్కున ఆ సినిమాలో చేయబోయే హీరోని గెస్ చేసేయవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు చేస్తే ఆ ముగ్గురు హీరోలతోనే చేస్తాడు, వాళ్ళకు నచ్చే కథలనే రాసుకుంటాడు. ఇదే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. తెలుగులో ఇక హీరోలే లేరన్నట్టుగా చేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడనే టాక్ ఆయనపై ఎప్పుడూ నడుస్తూనే […]
Trivikram Srinivas |
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన తర్వాత చేసే సినిమాల విషయంలో.. సినిమా అనగానే టక్కున ఆ సినిమాలో చేయబోయే హీరోని గెస్ చేసేయవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు చేస్తే ఆ ముగ్గురు హీరోలతోనే చేస్తాడు, వాళ్ళకు నచ్చే కథలనే రాసుకుంటాడు. ఇదే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది.
తెలుగులో ఇక హీరోలే లేరన్నట్టుగా చేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడనే టాక్ ఆయనపై ఎప్పుడూ నడుస్తూనే ఉంది. పైగా రాసుకున్న కథకు మరే హీరో నచ్చడని వీళ్ళే కావాలని ముందే కర్చీఫ్ వేసేసి మరీ బుక్ చేసుకోవడాన్ని చూస్తుంటే.. ఆ ముగ్గురు నలుగురు నుంచి త్రివిక్రమ్ బయటికి రాలేకపోతున్నాడనేలా ఆయనపై కామెంట్స్ పడుతున్నాయి.
త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్ డైలాగులు, మంచి హాస్యం, సీరియస్ నెస్, లోతైన సెంటిమెంట్ ఇలా ప్రతి ఎలిమెంట్ సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టేస్తుందనే టాక్ ఉంది. దానితో సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమనే ఆయనపై పొగడ్తలు పడటమే కాకుండా.. టాప్ దర్శకుడిలో ఒకడిగా ఆయనని చూస్తుంటారు. అలాంటి దర్శకుడిగితో పని చేయాలని చాలా మంది హీరోలకు ఉంటుంది.
కానీ ఇండస్ట్రీలోని ఇద్దరు ముగ్గురు హీరోలను తప్పితే.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేయలేడనేలా ఆయనపై ఇప్పుడు విమర్శలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎవరేం అనుకుంటే నాకేంటి నారూటే వేరు అన్న ధోరణిలో సాగిపోతున్న ఈ దర్శకుడి అసలు ఆలోచన ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
త్రివిక్రమ్ వరుసగా పవన్, అల్లు అర్జున్, మహేష్ తప్పితే మరో హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాయడం కానీ, మరో హీరోకి ఛాన్స్ ఇవ్వడం కానీ చేయడని రీసెంట్గా ఆయన ప్రకటించిన మూవీతో తెగ ట్రోల్ అవుతున్నాడు. గురూజీగా తెగ పొగిడేసిన అభిమానులు ఇప్పుడు రోజూ నెట్టింట ఏదో వార్తలో ఇరికించి మరీ ఆడుకుంటున్నారు. తన సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఇవ్వడు సరికదా వీళ్ళ డేట్స్ కూడా లాక్ చేసి పెడుతున్నాడని గురూజీపై కొందరు గరంగరంగా ఉన్నారు.
మహేష్‌తో ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లకుండానే అల్లు అర్జున్‌తో కూడా మరో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. ఇలా కాస్త మార్క్ ఉన్న హీరోలని ముందే లాక్ చేసి పెట్టుకుంటే ఎలాగనే గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఆ మధ్య నితిన్‌తో తీసిన ‘అఆ’ సినిమా, ఎన్టీఆర్‌తో తీసిన ‘అరవింద సమేత’ సినిమాలు తప్పితే మిగతా హీరోలని తన కాంపౌండ్‌లోకి అడుగు పెట్టనీయడం లేదనేలా మిగతా హీరోల ఫ్యాన్స్ హర్టవుతున్నారు. దీని వెనక త్రివిక్రమ్ స్టేటజీ ఏంటో అని బుర్రలు గోక్కుంటున్నారు సినీ జనాలు. చూడాలి.. రాబోయే రోజులలోనైనా ఇతర హీరోలకు ఈ గురూజీ ఛాన్స్ ఇస్తాడేమో..