Venkatesh Trivikram New film| వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’

సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్ ఖరారు చేశారు. మేకర్స్ హారిక & హాసిని క్రియేషన్స్ 'ఆదర్శ కుటుంబం' టైటిల్ ఖరారుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. హౌస్‌ నం47 (AK47)’ అనేది ఉప శీర్షిక.

Venkatesh Trivikram New film| వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’

విధాత : సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్-త్రివిక్రమ్( Venkatesh Trivikram) కాంబోలో రాబోతున్న సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) అనే టైటిల్ ఖరారు చేశారు. మేకర్స్ హారిక & హాసిని క్రియేషన్స్ ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ ఖరారుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. హౌస్‌ నం47 (AK47)’ అనేది ఉప శీర్షిక. 2026 సమ్మర్ సీజన్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలిపింది. టైటిల్ ప్రకటనతో పాటు సినిమాలో హీరో వెంకటేష్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేశ్‌ సింపుల్‌లుక్‌లో మధ్యతరగతి ఫ్యామిలీ మ్యాన్‌గా ఆకట్టుకున్నారు. వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందనుంది. టైటిల్ చూస్తే హాస్యంతో కూడిన వినోధ భరిత కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి-అనిల్‌ రావిపూడి కాంబోలో రానున్న ‘మన శంకర వరప్రసాద్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘దృశ్యం -3’ మూవీలో కూడా నటించనున్నారు.

వెంకటేశ్‌ కథానాయకుడిగా గతంలో వచ్చిన హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ని అందించారు. ఇప్పుడు వెంకటేష్ ను త్రివిక్రమ్ నేరుగా డైరక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. అలాగే త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ల పరంపర ‘ఆదర్శ కుటుంబం’ లోనూ కొనసాగనుందని తెలుస్తంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి పేరు ఖరారైందని..మరో హీరోయిన్ గా త్రిష, నిధి అగర్వాల్‌, రుక్మిణీ వసంత్‌ పేర్లు వినిపిస్తున్నాయి. బలంగా వినిపిస్తోంది. దీనితో పాటు వెంకటేశ్‌ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.