Mahesh Babu| మహేశ్ బాబు ‘అతడు’ సినిమా రీరిలీజ్ లో ఫ్యాన్స్ సందడి

విధాత : సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హిట్ సినిమా ‘అతడు’ (Athadu)సినిమా రీరిలీజ్(Re-Release)లోనూ ఆయన అభిమానులను అలరిస్తుంది. మహేశ్ అభిమానులు మరోసారి తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. థియేటర్ల వద్ద హంగామా(Ffans Celebrations) చేస్తున్నారు. మహేశ్ 50వ పుట్టినరోజు ఆగస్టు 9 సందర్భంగా విజయవాడ అలంకార్ థియేటర్ ‘అతడు’ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు కేక్ కటింగ్..కటౌట్ పూజలతో సందడి చేశారు. ఓ థియేటర్ లో యువతి పిల్లగాలి అల్లరి సాంగ్ కే థియేటర్ లో చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. సినిమాను 4కే, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4కే సినిమా ఫార్మాట్‌లోను, ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌తోపాటు ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్ 4కే టెక్నాలజీతో జోడించి విడుదల చేశారు. ఇలాంటి హంగులతో లేటేస్ట్ టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కలర్ గ్రేడింగ్, సౌండ్ క్వాలిటీ బ్రహ్మండంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. పిక్చర్ క్వాలిటీని తెర మీద సూపర్‌గా తీసుకొచ్చారు. అతడు చిత్రం తెలుగు రాష్ట్రాలు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కర్నాటక సహా పలు రాష్ట్రాలలో మళ్లీ విడుదల చేశారు.
జయభేరి బ్యానర్‌పై 2005 ఆగస్టు 10న సంవత్సరంలో రిలీజైన అతడు చిత్రం మహేశ్ కేరీర్ లో మరో హిట్ గా నిలిచింది. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అతడు మూవీ పుల్ రన్‌లో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో మార్కెట్‌ను ఓపెన్ చేసింది. ఈ చిత్రం 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏకధాటిగా 175 రోజులు ఆడటమే కాకుండా 1.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
టెలివిజన్ తెరపై మాత్రం అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. కథ, మాటలు, దర్శకత్వం బాధ్యతలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలీలో రూపొందించిన అతడు మూవలో హీరోయిన్ గా త్రిషా కృష్ణన్, కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, సోను సూద్, సాయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, నాజర్, సునీల్, గిరిబాబు, ధర్మవరపు, సుధ, బ్రహ్మనందం, హేమ, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ తదితరులు నటించారు.
Read more : కదలికల్లేని కొడంగల్ లిఫ్ట్.. పరిహారం కోసం రైతుల ఉద్యమ బాట
జూనియర్లకు డ్రగ్స్ అలవాటు చేసిన సీనియర్ మెడికోలు