CM KCR ఇన్‌చార్జి గ్రామంలో టీఆర్ఎస్‌కు మెజార్టీ
విధాత, మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న మర్రిగూడ మండలం లెంకలపల్లిలో టిఆర్ఎస్ పార్టీకి 254 ఓట్ల మెజారిటీ వచ్చింది. గ్రామంలో మొత్తం 1927 ఓట్లకు గాను 1795 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ పార్టీకి 944 ఓట్లు, బీజేపీకి 690 ఓట్లు, కాంగ్రెస్‌కు 52 ఓట్లు, బీఎస్పీకి 20 ఓట్లు పోలయ్యాయి. ఈటెల రాజేందర్ అత్తగారు ఊరైన పలివెలలో బీజేపీకి 400 ఓట్లు ఆధిక్యత లభించింది. ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ […]

విధాత, మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న మర్రిగూడ మండలం లెంకలపల్లిలో టిఆర్ఎస్ పార్టీకి 254 ఓట్ల మెజారిటీ వచ్చింది. గ్రామంలో మొత్తం 1927 ఓట్లకు గాను 1795 ఓట్లు పోలవ్వగా, టీఆర్ఎస్ పార్టీకి 944 ఓట్లు, బీజేపీకి 690 ఓట్లు, కాంగ్రెస్‌కు 52 ఓట్లు, బీఎస్పీకి 20 ఓట్లు పోలయ్యాయి.
ఈటెల రాజేందర్ అత్తగారు ఊరైన పలివెలలో బీజేపీకి 400 ఓట్లు ఆధిక్యత లభించింది. ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్నారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ,మల్లారెడ్డి, గంగుల ప్రభాకర్లు ఇన్చార్జిలుగా ఉన్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీకి ఆధిక్యత లభించడం గమనార్హం.