పిల్లిని కాపాడబోయి ప్రాణాలు తీసుకున్న మహిళ
పెంపుడు జంతువుల పట్ల కొందరు చూపే ప్రేమ వర్ణించడం కాస్త కష్టమే.. మనుషులకంటే ఎక్కువగా వారు పెంచుకునే జంతువులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు

విధాత: పెంపుడు జంతువుల పట్ల కొందరు చూపే ప్రేమ వర్ణించడం కాస్త కష్టమే.. మనుషులకంటే ఎక్కువగా వారు పెంచుకునే జంతువులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కొందరైతే ఏకంగా వారు పడుకునే సమయంలో కూడా వాటిని విడువరు. వాటిపై పెంచుకున్న ప్రేమ కొన్నిసార్లు వారి ప్రాణాలపైకి వస్తున్నది. ఇలాంటి సంఘటనే కలకత్తాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే కలకత్తాకు చెందిన అంజనా దాస్ అనే మహిళ పులి గంజ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదో అంతస్తులో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నది.
ఆదివారం తాను పెంచుకుంటున్న పిల్లి కనిపించకపోవడంతో దాన్ని వెతకడం మొదలు పెట్టింది. సోమవారం ఉదయం 8 గంటలకు అపార్ట్‌మెంట్‌లో రెనొవేషన్ పనులు జరుగుతుండటంతో ఆ పిల్లి భవనానికి కట్టిన టార్పాలిన్‌లో చిక్కుకున్నట్లు గుర్తింది. దీంతో దాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుండగా ఎనిమిదవ అంతస్తునుంచి పడిపోయింది. పెద్దగా శబ్దంరావడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ వెంటనే తనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అంజనా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాదమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది ప్రమాదవశాత్తే జరిగి ఉంటుందని ఏ ఇతర కుట్రకోణం కనిపించడంలేదని ఓ అంచనాకు వచ్చారు