TSPSC : పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. కొడుకు కోసం పేపర్ కొన్న తండ్రి
TSPSC పేపర్‌ను రూ. 6 లక్షలకు బేరం పెట్టిన డాక్యా నాయక్.. రూ. 2 లక్షలు మాత్రమే ఇస్తానన్న మైబయ్య డబ్బు డాక్యా బ్యాంకు ఖాతాలకు బదిలీ కాగానే చేతికి వచ్చిన పేపర్ విధాత: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. కుమారుడి కోసం డాక్యాకు రూ. 2 లక్షలు ఇచ్చి తండ్రి ఏఈ […]

TSPSC
- పేపర్‌ను రూ. 6 లక్షలకు బేరం పెట్టిన డాక్యా నాయక్..
- రూ. 2 లక్షలు మాత్రమే ఇస్తానన్న మైబయ్య
- డబ్బు డాక్యా బ్యాంకు ఖాతాలకు బదిలీ కాగానే చేతికి వచ్చిన పేపర్
విధాత: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. కుమారుడి కోసం డాక్యాకు రూ. 2 లక్షలు ఇచ్చి తండ్రి ఏఈ పేపర్ కొన్నాడు.
ఈ కేసులో ఇప్పటివరకు 19 మంది అరెస్టయ్యారు. మైబయ్య వికారాబాద్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. డాక్యా నాయక్‌తో మైబయ్య పరిచయం పెంచుకున్నాడు. డాక్యా ఏఈ పేపర్‌ను రూ. 6 లక్షలకు బేరం పెట్టాడు. రూ. 2లక్షలు మాత్రమే ఇస్తానని మైబయ్య చెప్పాడు.
ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో డాక్యా బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేశాడు. డబ్బు బదిలీ తర్వాత మైబయ్య చేతికి ఏఈ పేపర్ వచ్చింది. కుమారుడికి పేపర్ ఇచ్చి ఏఈ పేపర్ రాయించాడు