TSRTC | టీఎస్‌ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్..! రూ.2000కే శ్రీశైలం దేవస్థానం టూర్ ప్యాకేజీ..!
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రైవేటు ట్రావెల్స్‌కు పోటీగా స్పెషల్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నది. ఇప్పటికే టికెట్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవస్థానాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటిస్తున్నది. ఇప్పటికే తిరుమల, అరుణాచలంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలకు పర్యటన ప్యాకేజీలు ప్రకటించిన సంస్థ.. తాజాగా జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లే వారి […]

TSRTC |
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రైవేటు ట్రావెల్స్‌కు పోటీగా స్పెషల్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నది. ఇప్పటికే టికెట్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవస్థానాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటిస్తున్నది.
ఇప్పటికే తిరుమల, అరుణాచలంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలకు పర్యటన ప్యాకేజీలు ప్రకటించిన సంస్థ.. తాజాగా జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్రాకేజీని ప్రకటించింది.
ఇందులో భాగంగా ప్రతివారం వీకెండ్స్‌లో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడుపనున్నది. ఈ టూర్ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ప్యాకేజీలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయాలతో పాటు పాతాళగంగ, శ్రీశైలం డ్యామ్, శిఖర దర్శనం, పంచధార, పాలధార, సాక్షిగణపతి ఆలయాలను దర్శించుకోవచ్చు.
ఈ ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2700గా నిర్ణయించారు. పిల్లలకు సైతం ప్రత్యేకంగా రూ.1570గా నిర్ణయించారు. ఈ నెల 22న ప్రత్యేక బస్సులను ప్రారంభించనున్నారు. వారాంతంలో జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు బస్సు బయలుదేరుతుండగా.. 8గంటలకు ఎంజీబీఎస్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాతాళగంగ సందర్శనతో పాటు బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం ఉంటుంది.
రాత్రి హోటల్‌లోనే బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీశైలం డ్యామ్ పంచధార, శిఖరం, సాక్షి గణపతి ఆలయాలను దర్శిస్తారు. తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ప్యాకేజీలోని ఆలయ దర్శనం, హోటల్‌లో వసతి వర్తిస్తుంది. భోజనం, ఇతర ఖర్చులను మాత్రం ప్రయాణికులే భరించుకోవాల్సి ఉంటుంది.
శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులు వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అయితే, శని, ఆదివారాల్లో జంట నగరాల నుంచి భారీగా శ్రీశైలానికి వెళ్తున్నారు. దీంతో రద్దీ అధికంగా ఉంటున్నది. ప్రతి రోజు దాదాపు 40 సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నడుపుతుండగా.. రద్దీకి అనుగుణంగా బస్సులు సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ప్యాకేజీని తీసుకువచ్చింది.