Tungaturthi | తుంగతుర్తి ప్రగతి నివేదన కేటీఆర్ సభ వాయిదా

Tungaturthi విధాత: తుంగతుర్తి నియోజకవర్గంలో ఈనెల 27న తలపెట్టిన తుంగతుర్తి ప్రగతి నివేదన సభ వాయిదా పడింది. ఈ నెల 26, 27వ తేదీలలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సోలాపుర్, తుల్జాపూర్ భవాని, పండరీపూర్ విఠలాచార్య గుడి దర్శనాలకు వెళ్లి వచ్చే కార్యక్రమం ఉన్నది. అందుకే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తుంగతుర్తి బహిరంగ సభ వేయిదా వేసినట్లుగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రకటించారు. వాయిదా వేసిన […]

Tungaturthi  | తుంగతుర్తి ప్రగతి నివేదన కేటీఆర్ సభ వాయిదా

Tungaturthi

విధాత: తుంగతుర్తి నియోజకవర్గంలో ఈనెల 27న తలపెట్టిన తుంగతుర్తి ప్రగతి నివేదన సభ వాయిదా పడింది. ఈ నెల 26, 27వ తేదీలలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సోలాపుర్, తుల్జాపూర్ భవాని, పండరీపూర్ విఠలాచార్య గుడి దర్శనాలకు వెళ్లి వచ్చే కార్యక్రమం ఉన్నది.

అందుకే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తుంగతుర్తి బహిరంగ సభ వేయిదా వేసినట్లుగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రకటించారు. వాయిదా వేసిన కేటీఆర్ సభను ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వెల్లడించారు.