భూకంపంతో తుర్కియే-సిరియాలో 33వేల మంది మృత్యువాత..!
Turkey-Syria Earthquake | వరుస భూకంపాలతో తీవ్ర విధ్వంసానికి గురైన తుర్కియేలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఆగ్నే ప్రాంతమైన తుర్కియేలోని కహ్రామన్‌మరాస్‌లో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణంగా 24 కిలోమీటర్ల దూరంలో ఆదివారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతసోమవారం సంభవించిన భూకంపాల ధాటికి ఇప్పటి వరకు 33వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తుర్కియేలో 29,605కు చేరింది. సిరియా వాయువ్య ప్రాంతంలో […]

Turkey-Syria Earthquake | వరుస భూకంపాలతో తీవ్ర విధ్వంసానికి గురైన తుర్కియేలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఆగ్నే ప్రాంతమైన తుర్కియేలోని కహ్రామన్‌మరాస్‌లో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణంగా 24 కిలోమీటర్ల దూరంలో ఆదివారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతసోమవారం సంభవించిన భూకంపాల ధాటికి ఇప్పటి వరకు 33వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తుర్కియేలో 29,605కు చేరింది.
సిరియా వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న 2,168 మంది, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిరియాలోని ప్రాంతాల్లో 1,408 మందితో సహా మొత్తం 3,576 మంది మరణించారు. తుర్కియేలోని పది ప్రావిన్సుల్లో భూకంపం కారణంగా 25వేలకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఇంకా పదివేల కంటే ఎక్కువ మృతదేహాలు ఉండవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక సంస్థలు కూడా మొత్తం మృతుల సంఖ్య 50వేలకుపైగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, తుర్కియేలో మరణాలకు భవన నిర్మాణాల్లో ఉన్న లోపాలే కారణమని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకున్నట్లయితే భూకంపం వల్ల నష్టం జరిగే ఉండేది కాదని పేర్కొంటున్నారు. నాసిరకం భవనాలు నిర్మిస్తున్నారన్న కారణంతో 130మందికిపైగా కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు.