Turkey Earthquake | శిథిలాల కింద గ‌ర్భిణి.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి మృతి

ట‌ర్కీ, సిరియాలో సంభ‌వించిన భూంక‌పాలు విల‌యాన్ని సృష్టించాయి. వేలాది మందిని బ‌లిగొన్నాయి. అలాంటి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన‌ కొన్ని దృశ్యాలు క‌న్నీళ్ల‌ను తెప్పిస్తున్నాయి. సిరియాలోని అలెప్పో న‌గ‌రంలో సంభ‌వించిన భూకంప ధాటికి ఓ బిల్డింగ్ నేల‌మ‌ట్టం అయింది. ఆ భ‌వ‌నం శిథిలాల్లో ఓ గ‌ర్భిణి చిక్కుకుంది. ఆమె ప్రాణాలు కోల్పోయిన‌ప్ప‌టికీ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప‌సిపాప ఊపిరితో ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. ఆ బిడ్డ‌ను చేరిదీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ మ‌గ‌బిడ్డ‌ను శిథిలాల కింద నుంచి తీసి, త‌క్ష‌ణ‌మే […]

Turkey Earthquake | శిథిలాల కింద గ‌ర్భిణి.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి మృతి

ట‌ర్కీ, సిరియాలో సంభ‌వించిన భూంక‌పాలు విల‌యాన్ని సృష్టించాయి. వేలాది మందిని బ‌లిగొన్నాయి. అలాంటి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన‌ కొన్ని దృశ్యాలు క‌న్నీళ్ల‌ను తెప్పిస్తున్నాయి. సిరియాలోని అలెప్పో న‌గ‌రంలో సంభ‌వించిన భూకంప ధాటికి ఓ బిల్డింగ్ నేల‌మ‌ట్టం అయింది.

ఆ భ‌వ‌నం శిథిలాల్లో ఓ గ‌ర్భిణి చిక్కుకుంది. ఆమె ప్రాణాలు కోల్పోయిన‌ప్ప‌టికీ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప‌సిపాప ఊపిరితో ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. ఆ బిడ్డ‌ను చేరిదీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ మ‌గ‌బిడ్డ‌ను శిథిలాల కింద నుంచి తీసి, త‌క్ష‌ణ‌మే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన దృశ్యాలు క‌న్నీళ్ల‌ను తెప్పిస్తున్నాయి.