Earthquake | ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 78 భూకంపాలు.. సిరియాలోనే అత్యధికంగా 46 రికార్డు..!

Earthquake | మిడిల్‌ ఈస్ట్‌లోని నాలుగు దేశాలు టర్కీ, సిరియా, లెబనాన్‌తో పాటు ఇజ్రాయెల్‌ సోమవారం భూకంపంతో వణికిపోయాయి. వరుస భూకంపాలు టర్కీ, సిరియాలో భారీ విధ్వంసం సృష్టించాయి. 12 గంటల్లో రిక్టర్‌ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని అతలాకుతలం చేశాయి. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయగా.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ వారి రోదనలతో టర్కీ, సిరియా […]

Earthquake | ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 78 భూకంపాలు.. సిరియాలోనే అత్యధికంగా 46 రికార్డు..!

Earthquake | మిడిల్‌ ఈస్ట్‌లోని నాలుగు దేశాలు టర్కీ, సిరియా, లెబనాన్‌తో పాటు ఇజ్రాయెల్‌ సోమవారం భూకంపంతో వణికిపోయాయి. వరుస భూకంపాలు టర్కీ, సిరియాలో భారీ విధ్వంసం సృష్టించాయి. 12 గంటల్లో రిక్టర్‌ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని అతలాకుతలం చేశాయి. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయగా.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ వారి రోదనలతో టర్కీ, సిరియా వీధులు దద్దరిల్లుతున్నాయి. వరుప ప్రకంపనలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మొదటి భూకంపం..

అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో తొలిసారిగా భూకంపం సంభవించింది. టర్కీలోని కహ్రామన్మరాస్‌ ప్రావిన్స్‌లోని గాంజియాంటెప్‌ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 24 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 4.17 గంటల సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి. 11 నిమిషాల తర్వాత మరోసారి రిక్టర్‌ స్కేల్‌పై 6.7 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. మళ్లీ మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.5 తీవ్రతతో మూడోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఇదే సమయంలో సిరియాలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 50కిపైగా భూకంపాలు రికార్డయ్యాయి. వీటిలో నాలుగు రిక్టర్‌ స్కేల్‌పై 6 తీవ్రత కంటే ఎక్కువగా, 5 నుంచి 6 తీవ్రతతో దాదాపు పది భూకంపాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 78 భూకంపాలు..

సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 78 భూకంపాలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా సిరియాలోనే 46 రికార్డయ్యాయి. వరుస భూకంపాలు టర్కీ, సిరియాలో పెను విషాదాన్ని కలిగించాయి. ప్రకృతి ప్రకోపానికి వేలాది సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు. శిథిలాల కింద నుంచి తమను కాపాడాలని కేకలు వేస్తున్నారు. ఓ యూట్యూబర్ శిథిలాల కింద నుంచి వీడియోను తీసి పంపి.. ప్రాణాలను కాపాడాలని వేడుకున్నాడు.